ఇన్స్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్.. ఇంట్రెస్టింగ్ ఫస్ట్ పోస్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొత్తగా సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్‌స్టాగ్రామ్ లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. గతంలో కేవలం ఫేస్‌బుక్ ఖాతా మాత్రమే మెయిన్‌టైన్ చేసిన ఆయన ఇన్స్‌స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టడం మెగా అభిమానులు స్వాగతించారు. అయితే ఆయన ఇన్స్‌స్టా లోకి వచ్చి రెండు రోజులైనా ఒక్క పోస్టు కూడా పెట్టక పోవడంతో.. చెర్రీ నుంచి చూడబోయే మొదటి పోస్ట్ ఏదై ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది నెటిజన్లలో.

తాజగా ఆ ఆసక్తికి తెర దించుతూ తన తొలి పోస్ట్ షేర్ చేశాడు రామ్ చరణ్. ఆయన షేర్ చేసిన ఈ పోస్ట్ ద్వారా అమ్మపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు చెర్రీ. అమ్మ ఒడిలో చిన్నప్పుడు ఉన్న జ్ఞాపకం, మళ్ళీ పెద్దయ్యాక అమ్మలో ఉన్న తీయని మమకారాన్ని తెలిపేలా ఫోటో షేర్ చేశాడు. రామ్ చరణ్ తొలి పోస్ట్ కావడం, తల్లి కొడుకుల ప్రేమ కనిపిస్తుండటంతో ఈ పిక్ చూసి మురిసి పోతున్నారు మెగా అభిమానులు. చెర్రీ మనసు వెన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ram Charan Posted His First in Instagram

ఇక రామ్ చరణ్ ఇన్స్‌స్టాగ్రామ్ లోకి రావడాన్ని మెగా ఫ్యామిలీ ఫుల్లుగా సపోర్ట్ చేసింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదలుకొని కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు బేబీ, వరుణ్ తేజ్, నిహారిక, శ్రీజ తదితర మెగా కుటుంబీకులు ఆయనకు గ్రాండ్ వెల్‌కం చెప్పారు. మరోవైపు మెగా అభిమానుల ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయన అకౌంట్ కి 5 లక్షలకు పైగా ఫాలోయింగ్ రావడం విశేషం.

ఇక రామ్ చరణ్ సినిమాల సంగతి చూస్తే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా సెట్స్ పై బిజీగా ఉన్నాడు. భారీ మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. RRR చేస్తూనే మరోవైపు 'సైరా నరసింహ రెడ్డి' నిర్మాణ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X