For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ram Charan ఖాతాలో మరో ఖరీదైన కారు.. ఇండియాలోనే తొలి వ్యక్తిగా.. ధర ఎంతో తెలుసా?

  |

  మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు విలాసవంతమైన కార్లు అంటే ఎంతో ఇష్టమో మాటల్లో చెప్పలేం. మార్కెట్‌లోకి కొత్తగా ఏదైనా కారు వచ్చిందంటే చాలూ.. ఆ ఖరీదైన కారు తన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650 కారుకు చెర్రీ ఓనర్ అయ్యాడు. ఆ కారుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ కారు ధర ఎంత? రాంచరణ్ వ్యక్తిగత, ప్రొఫెషన్ జీవితానికి సంబంధించిన వివరాలు అలాగే.. ఆయన వద్ద ఎన్ని కార్లు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొందాం..

  భారీ ప్రాజెక్టులపై రాంచరణ్ నజర్

  భారీ ప్రాజెక్టులపై రాంచరణ్ నజర్


  లాక్‌డౌన్ కారణంగా రాంచరణ్ కెరీర్ కాస్త స్లో అయినట్టు కనిపించినా.. క్రేజీ ప్రాజెక్టులతో తన కెరీర్‌ను అద్భుతంగా మలచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన RRR చిత్రం కరోనావైరస్ కారణంగా చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్నది. RRR షూటింగ్ కంప్లీట్ చేసుకొని భారీ చిత్రాలపై దృష్టిపెట్టారు.

  శంకర్, దిల్ రాజుతో సినిమా

  శంకర్, దిల్ రాజుతో సినిమా

  ఇటీవలే సెన్సేషనల్ డైరెక్టర్, దేశం గర్వించదగిన దర్శకుడు శంకర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో రానున్న ఓ క్రేజీ ప్రాజెక్టు సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభ వేడుక ఘనంగా జరగడమే కాకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి శుభ సమయంలో మరో విలాసవంతమైన కారును కొనుగోలు చేసి మళ్లీ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు.

  కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650

  కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650

  ఇండియన్ మార్కెట్‌లోకి కొత్తగా మెర్సిడెజ్ కంపెనీ మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650 ఖరీదైన కారును తీసుకొచ్చింది. ఇండియాలోనే ఈ కారును సొంతం చేసుకొన్న తొలి వ్యక్తి రాంచరణ్ ఘనతను సాధించాడు. ఇటీవల ఆ కారుకు సంబంధించిన తాళాలను కంపెనీ నిర్వాహకులు అందించారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

  ఇండియాలోనే తొలి వ్యక్తిగా రాంచరణ్

  ఇండియాలోనే తొలి వ్యక్తిగా రాంచరణ్

  మెర్సిడెజ్ బెంజ్ ఇండియా తొలిసారి మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650 దేశంలోకి ప్రవేశపెట్టింది. మేబ్యాచ్ రెంజ్‌లో ఇది తొలి ఎస్‌యూవీ వెహికిల్ కాగా, మేబ్యాచ్ మోడల్‌లో మేబ్యాచ్ ఎస్ క్లాస్ తర్వాత ఇది రెండోది. ఈ కారు పొడవు 5205ఎంఎం, వెడల్పు 2030ఎంఎం. ఇంజిన్ సామర్థ్యం 3982 సీసీ, పవర్ అండ్ టోర్క్ విషయానికి వస్తే.. 550 బీహెచ్‌పీ, 730 ఎన్ ఎమ్. పెట్రోల్‌తో నడిచే ఈ కారు వెర్షన్ 600 4మ్యాటిక్. ఐదు సీట్లు ఉన్న ఈ కారు లీటర్‌కు 8.5 కిలోమీటర్లు ఇస్తుంది అని కంపెనీ వెల్లడించింది.

  Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)

  మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650 కారు స్పీడ్ ఎంతంటే

  మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650 కారు స్పీడ్ ఎంతంటే


  మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650 కారు స్పీడ్ విషయానికి వస్తే అత్యంత వేగంగా పికప్ అందుకొంటుంది. 4.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకొనే సామర్థ్యం ఉంది. గంటకు 250 కిలో మీటర్ల టాప్ స్పీడ్‌తో వెళ్లే కెపాసిటీ ఉంది. మెర్సిడేజ్ మోడల్స్‌లో అత్యాధునిక టెక్నాలజీతో ఈ కారును రూపొందించారు. ఇలాంటి విశేషాలు ఉన్న కారును అందుకొన్న వ్యక్తిగా రాంచరణ్ నిలిచారు.

  మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650 ధర ఎంతంటే

  మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650 ధర ఎంతంటే


  ఇక మెర్సిడెజ్ మే‌బ్యాచ్ జీఎల్ఎస్ 650 కారు ధర విషయానికి వస్తే... భారీగానే ఉంది. ఇండియాలో ఈ కారు ఎక్స్ షోరూం ధర 2.43 కోట్ల రూపాయలతో మొదలు అవుతుంది. అయితే రాంచరణ్ తనకు ఇష్టం వచ్చిన రీతిలో కస్టమైజ్ చేసుకొన్న నేపథ్యంలో, అలాగే ఎంచుకొన్న మోడల్‌‌కు సుమారు 4 కోట్ల రూపాయలు అని కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు. రాంచరణ్ సొంతం చేసుకొన్న ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.

  Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
  రాంచరణ్ గ్యారేజ్‌లో ఉన్న విలాసవంతమైన కార్లు ఇవే

  రాంచరణ్ గ్యారేజ్‌లో ఉన్న విలాసవంతమైన కార్లు ఇవే

  రాంచరణ్ గ్యారేజీలో ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అందులో ఆస్టాన్ మారట్ిన్ వీ8 వాంటేజ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫి, రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ 350 లాంటి వాహనాలను ఇప్పటికే సొంతం చేసుకొన్నారు.

  English summary
  Mega Power Star #RamCharan is the proud owner of India's 1st #Mercedes Maybach GLS600 customized version.This vehicle cost is 4 crores.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X