Janhvi Kapoor Net Worth : జాన్వీ కపూర్ నెట్ వర్త్... 28 ఏళ్లలో ఎన్ని కోట్లు సంపాదించిందంటే?
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షలకు కూడా దగ్గరైన సంగతి తెలిసిందే. హిందీలో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి ప్రశంసలు అందుకుంది. ఇక శ్రీదేవికి సౌత్ లోనూ విపరీతమైన ఆడియెన్స్ ఉండటంతో ఆమె ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూశారు. కాగా గతేడాది జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర : పార్ట్ 1'లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. తొలి చిత్రంతోనే భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
కాగా, జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ చిత్రాల్లోనూ నటిస్తోంది. మొదటి జూనియర్ ఎన్టీఆర్ కు ధీటుగా పెర్ఫామెన్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న RC16 చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు 'సుందరి' అనే చిత్రంలోనూ నటిస్తున్నది. కాగా ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఆయా చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.

యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించిన ఆసక్తికర విషయాలు అభిమానులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. జాన్వీ కపూర్ 1997 మార్చి 6న జన్మించింది. నేటితో 28వ ఏట అడుగు పెట్టింది. ముంబైలోనే పుట్టిన పెరిగిందీ ముడ్దుగుమ్మ. బోణీ కపూర్ - శ్రీదేవీల పెద్ద కుమార్తె ఈమె. జాన్వీకి ఒక చెల్లెలు ఖుషి కపూర్ ఉంది. ఆమె కూడా హీరోయిన్ కావడం విశేషం. ఇక జాన్వీ కపూర్ ముంబైలోనే తన ఎడ్యూకేషన్ ను పూర్తి చేసుకుంది. కాలిఫోర్నియాలో మాత్రం థియేటర్ అండ్ ఫిల్మ్ కోర్సులో శిక్షణ పొందింది. ఆ తర్వాత శ్రీదేవీ, నిర్మాత బోణీ కపూర్ల కూతురుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
'ధడక్' చిత్రంతో నార్త్ ఆడియెన్స్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తల్లి శ్రీదేవి మాదిరిగానే మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఆ తర్వాత 'గోస్ట్ స్టోరీస్', 'గుంజన్ సక్సెనా', 'రూహి', 'గుడ్ లక్ జెరీ', 'మిలి', 'బావల్', 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ', 'థేరీ బాతో మే ఐసా ఉల్జా జీయా', 'మిస్టర్ అండ్ మిస్ ధోని', 'ఉల్జా' వంటి హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ లోకి 'దేవర : పార్ట్ 1'తో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆర్సీ16లో నటిస్తోంది. నెక్ట్స్ అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ లో జాయిన్ కానుంది. అలాగే 'సన్నీ సంస్కారి కి తుల్సి కుమారి', 'పరమ్ సుందరి' వంటి చిత్రాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి.
ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం నార్త్, సౌత్ చిత్రాలతో ఫుల్ బిజీ అవుతోంది. ఒక్కో సినిమాకు ఈ ముద్దుగుమ్మ రూ.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. ఒక్క హిట్ పడితే మాత్రం మరింతగా డిమాండ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక జాన్వీ కపూర్ 28 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రూ.80 కోట్ల వరకు నెట్ వర్త్ ను కలిగి ఉంది. అలాగే ఆమెకు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. మెర్సిడెస్ మేబ్యాచ్ S560, మెర్సిడెస్ GLE 250D, మెర్సిడెస్ S-క్లాస్, బెంట్లీ వంటి కార్లు తన గ్యారేజీలో ఉన్నాయి.
అలాగే జాన్వీ ఖరీదైన బ్యాగులను కూడా కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఆమె దగ్గర గోయార్డ్, చానెల్, సెయింట్ లారెంట్, సెలిన్, లూయిస్ విట్టన్ వంటి బ్రాండ్ల బ్యాగులు కూడా ఉన్నాయి. అంతే కాదు.. ముంబైలో తన పేరు మీద ఒక విలాసవంతమైన భవనంలో డ్యూప్లెక్స్, చెన్నైలో ఒక ఇల్లు కూడా ఉంది. ఇక జాన్వీ కపూర్ కస్మోటిస్ట్స్ అండ్ బ్రాండెడ్ క్లాథ్స్ కు ఈ-కామర్స్ బిజినెన్స్ చేస్తూ బోలెడంత సంపాదిస్తోంది. రిలయన్స్ రిటైల్స్, బెనెటన్ పర్ఫ్యూమ్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ సంపాదిస్తోంది.


Click it and Unblock the Notifications











