చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ రోల్ లీక్.. ‘సిద్దూ’గా కనిపించనున్న మెగా పవర్ స్టార్.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి దాదాపు పది మంది సినీ పరిశ్రమకు పరిచయం అవడమే. అంతేకాదు, ఆ హీరోల్లో చాలా మంది స్టార్లుగా వెలుగొందుతున్నారు కూడా. అంతమంది హీరోలు ఉన్నా.. మెగా ఫ్యామిలీ నుంచి 'మనం' లాంటి సినిమా రావడం లేదని ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారని తెలిసింది. తాజాగా చెర్రీ చేస్తున్న రోల్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఇంతకీ వీళ్లిద్దరూ ఏ సినిమాలో చేస్తున్నారు.? వివరాల్లోకి వెళితే...

 అదిరిపోయే కమ్‌బ్యాక్.. అంతలోనే నిరాశ

అదిరిపోయే కమ్‌బ్యాక్.. అంతలోనే నిరాశ

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ‘ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆయనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన ‘సైరా: నరసింహారెడ్డి' అనే సినిమా చేశారు. అయితే, ఈ మూవీ మాత్రం తెలుగు ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది.

బడా డైరెక్టర్‌‌తో కలిసిన మెగాస్టార్

బడా డైరెక్టర్‌‌తో కలిసిన మెగాస్టార్

‘సైరా' వంటి భారీ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీని రామ్ చరణ్‌తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మకమైనది కావడంతో ఈ సినిమా విషయంలో దర్శకుడు కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అన్నీ ఫిక్స్ అయ్యాయి.. మళ్లీ మార్చేశారు

అన్నీ ఫిక్స్ అయ్యాయి.. మళ్లీ మార్చేశారు

వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, సైరా విడుదల ఆలస్యం కావడం వల్ల దాని ప్రభావం ఈ ప్రాజెక్టుపై పడింది. దీంతో ఈ సినిమా కోసం మొదట అనుకున్న కథ, టైటిల్, క్యారెక్టర్ సహా ఎన్నో అంశాలు మారిపోయాయట. సినిమా లైన్ ఒకటే అయినా.. కథలో కీలకమైన మార్పులు చాలా వరకు చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

కథకు తగ్గ టైటిల్.. ఇప్పుడు కట్ చేశారు

కథకు తగ్గ టైటిల్.. ఇప్పుడు కట్ చేశారు

ఈ సినిమా మొత్తం దేవాదాయ భూములను ఆక్రమించే వారిపై జరిపే పోరాటం ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ మూవీకి ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ ఫిక్స్ చేశారని అన్నారు. అయితే, కథలో కొన్ని మార్పులు జరగడంతో ఈ సినిమా టైటిల్‌ను ‘ఆచార్య'గా కుదించారనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ కీ రోల్

చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ కీ రోల్

కొరటాల శివ - చిరంజీవి సినిమా చేయబోతున్నారని లీకులు వచ్చిన సమయంలోనే, ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ, తర్వాత దీని గురించి ఎవరూ మాట్లాడలేదు. అయితే, ఈ మధ్య మాత్రం ఇందులో చెర్రీ నటిస్తున్నాడని ప్రచారం జోరందుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది.

‘సిద్దూ'గా కనిపించనున్న మెగా పవర్ స్టార్

‘సిద్దూ'గా కనిపించనున్న మెగా పవర్ స్టార్

చిరంజీవి సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర చేస్తున్నాడని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, అతడు క్యారెక్టర్ పేరు సిద్దూ అని సమాచారం. సినిమాలో చాలా కీలకమైన ఈ పాత్ర దాదాపు 20 నుంచి 30 నిమిషాలు ఉంటుందట. ఇంకో విషయం ఏమిటంటే.. ఇది చిరంజీవి యుక్త వయసు పాత్ర మాత్రం కాదని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X