పవర్‌ఫుల్ కథతో వినయ విధేయ రామ.. బంపర్ హిట్టేనట.. విలన్ రోల్ అదేనట..
మెగా పవర్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం వినయ విధేయ రామ. పక్కా కమర్షియల్ ఎలిమింట్స్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ, పాత్రల గురించి మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ సినిమాలోని విలన్ పాత్రకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. వివేక్ ఒబెరాయ్, రాంచరణ్ పాత్ర ఏమిటంటే..

యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా
రంగస్థలం చిత్రంతో పోల్చితే వినయ విధేయ రామ చిత్రంలో రాంచరణ్ పాత్ర పూర్తిగా అర్బన్ లుక్‌తో కూడుకొన్నది. కుటుంబానికి, తనపై నమ్మకం పెట్టుకొన్న వారికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకొనే పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఫ్యామిలీ విలువలకు పెద్ద పీట వేసినట్టు తెలుస్తున్నది.

పవర్ ఫుల్ విలన్‌గా వివేక్ ఒబెరాయ్
వినయ విధేయ రామ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్‌ది బీహారీ నేపథ్యమున్న పాత్ర అని తెలిసింది. బీహారీ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో విలన్ పాత్ర ఉంటుందట. బీహారి నేపథ్యంగా సినిమా కథకు ఏమిటనేది చాలా ఇంటస్ట్రింగ్‌గా మారింది.

హైలెట్‌గా యాక్షన్ సీన్లు
బీహారీ మాఫియా ఎపిసోడ్‌లో యాక్షన్ సీన్లు బోయపాటి మార్కులో చిత్రీకరించినట్టు తెలుస్తున్నది. ట్రైలర్‌లో రాంచరణ్ చూపించే అవేశం, దానికి బదులుగా వివేక్ ఒబెరాయ్ చూపించిన ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచినట్టు తెలుస్తున్నది.

సంక్రాంతికి నిజమైన పండుగ
ఇదిలా ఉండగా, వినయ విధేయ రామ సంక్రాంతికి విడుదల కానున్నది. సంక్రాతి రేసులో ఈ చిత్రం సూపర్‌హిట్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులకు, మెగా ఫ్యాన్స్‌కు నిజమైన పండుగ అని పేర్కొంటున్నారు.
మీ ప్రేమకు థ్యాంక్స్ అని వివేక్
ఇదిలా ఉండగా, వినయ విధేయ రామ చిత్రంలోని పాత్రపై వివేక్ ఒబెరాయ్ సంతృప్తిని ఇటీవల వ్యక్తం చేశాడు. షూటింగ్ చివరి రోజున వివేక్ ఒబెరాయ్ ఉద్వేగానికి గురయ్యాడు. రాంచరణ్‌తో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాపై కురిపించిన ప్రేమ, నాకు ఇచ్చిన గౌరవం, అతిథి మర్యాదలకు థ్యాంక్స్. నీ తండ్రికి ఉన్నట్టే మీకు ఉత్తమ విలువలు ఉన్నాయని ట్వీట్ చేయడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











