చిరు అలా చెర్రీ ఇలా.. బర్త్ డే స్పెషల్ పిక్
కొడుకు ఎంత మెగా పవర్ స్టార్ అయినా సరే తండ్రి మెగాస్టార్ చిరంజీవి ముందు పసివాడే. తండ్రికి మించిన తనయుడు అనే కోణంలో చిరంజీవిని సంతృప్తి పరిచాడు రామ్ చరణ్. డ్యాన్సులు, ఫైట్స్, యాక్షన్, ఎమోషన్స్ ఇలా ప్రతీ విషయంలోనూ చిరంజీవితో సరిసమానంగా నటించగల సత్తా ఉన్నవాడు రామ్ చరణ్. ఇక నేటి చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా షేర్ చేసిన ఓ ఫోటో మాత్రం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
మెగా ఇంట్లో వినాయక చవితి ఘనంగా జరిగింది. ఈ మేరకు చిరు చిన్న కూతరు శ్రీజ ఫ్యామిలీ కూడా వచ్చి చేరింది. చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్-ఉపాసన, కళ్యాణ్ దేవ్-శ్రీజ, శ్రీజ పెద్ద కూతురు నివృత్తి అందరూ కలిసి వినాయక చవితిని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇవి కాకుండా రామ్ చరణ్ ఓ స్పెషల్ పిక్‌ను షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతోన్నారు.

ఇంటి ముందు ఉండే లాన్ ఏరియాలో చిరు, చెర్రీలు రిలాక్స్ అవుతున్నారు. అయితే ఈ విశ్రాంతి తీసుకోవడంలోనూ ఇద్దరికిద్దరూ ఫోన్‌లో మునిగిపోయారు. కానీ ఇద్దరి పొజిషన్స్ వేరు.. చిరంజీవి రాజసింహాసనంపై కూర్చున్నట్టు ఠీవీతో కూర్చుంటే.. రామ్ చరణ్ మాత్రం హాయిగా నేలపై చిరంజీవి కాళ్ల ముందు పడుకుని ఫోన్‌లో బిజీగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ దగ్గర తన పెట్ కూడా ఉందనుకోండి. బర్త్ డే బాస్ అంటూ చెర్రీ పెట్టిన క్యాప్షన్.. ఆ ఫోటో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











