రామ్ చరణ్ - ఉపాసన బంధానికి పదేళ్లు.. ఇంత వరకు పిల్లలు లేకపోవడానికి కారణమిదే!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరైన వయసులోనే ఒక ఇంటివాడయ్యాడు. ప్రస్తుత రోజుల్లో సినీ తారలు చాలా వరకు లేటు వయసులోనే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి కంటే సినిమా కెరీర్ చాలా ఇంపార్టెంట్ అని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు కొందరు. ఇక రామ్ చరణ్ మాత్రం సరైన వయసులోనే ఉపాసనను వివాహం చేసుకున్నాడు. ఇక నేడు వీరి పెళ్లి రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ అందిస్తున్నారు.

కోట్ల ఖర్చుతో..
2012 జులై 14న రామ్ చరణ్, కామినేని ఉపాసనను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి అప్పట్లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దోమకొండ కోటలో కోట్ల ఖర్చుతో రాజాసంగా పెళ్లిని నిర్వహించి హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. ఇక నేటితో వీరి వివాహం జరిగి 8ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా చాలా మంది సినీ తారలు అభిమానులు వారికి విషెస్ అందిస్తున్నారు.

వారసుడు ఎప్పుడొస్తాడు..
మెగాస్టార్ చిరంజీవి నుంచి సెకండ్ జనరేషన్ హీరోలు ఏ స్థాయిలో దుమ్ము దులుపుతున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అదే తరహాలో ముడవతరం కూడా ఉంటుందని చెప్పవచ్చు. కానీ రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ వంశానికి ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతాడా అని గత కొన్నేళ్లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

8ఏళ్ళు కావడంతో..
ఇక నేటితో వారి పెళ్లి జరిగి ఎనిమిదేళ్లు కావడంతో మెగా వారసుడి రాక ఎప్పుడనే సందేహాలకు మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అయితే అందుకు గతంలోనే రామ్ చరణ్ సతీమణి ఉపసన ఒక వివరణ ఇచ్చింది. కామినేని వారసురాలు అపోలో చీఫ్ గా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్న పవర్ఫుల్ ఉమెన్ ఉపాసన గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
Recommended Video

అది మా పర్సనల్..
పిల్లలు, ప్రెగ్నెన్సీ అనేది మా పర్సనల్ విషయం. మాకు ఇప్పట్లో అలాంటి ఆలోచన అయితే లేదు. అలాగే నాకు ప్రెగ్నెన్సీ అంటే కొంత భయమే. ఇప్పుడిపుడే లావు తగ్గాను. మా ఇద్దరికి ఒక ప్లాన్ ఉంది. పిల్లల్ని ఎప్పుడు కనాలనే విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంది.. అంటూ ఉపాసన గత ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పింది. ఇక ఇప్పుడు ఎనిమిదేళ్లు పూర్తి కావాడంతో ఈ స్టార్ కపుల్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











