RRR నుంచి రామ్ చరణ్ అప్‌డేట్: సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న జక్కన్న టీమ్
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండేళ్లుగా జరుగుతూనే ఉంది. దీంతో పలుమార్లు విడుదల తేదీ కూడా వాయిదా పడింది. దీనివల్ల అభిమానులు బాధ పడకుండా చిత్ర యూనిట్ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది.
RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైన చాలా రోజుల వరకూ ఈ సినిమా నుంచి ఎటువంటి సర్‌ప్రైజ్‌లు రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇలాంటి సమయంలో మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. ఈ రెండూ రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక, ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా చెప్పింది.

మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. దీనికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఓ మెగా అభిమాని ట్విట్టర్ వేదికగా.. 'మా హీరో రామ్ చరణ్ పుట్టినరోజు కచ్చితంగా వారం రోజులు మాత్రమే ఉంది. అప్‌డేట్స్ ఎప్పుడు ఇస్తారు అంకుల్స్?' అంటూ చిత్ర యూనిట్‌ను ప్రశ్నించాడు. అంతేకాదు, దీనికి నాలుగు నిర్మాణ సంస్థలను ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన RRR యూనిట్ 'ఈరోజు చెప్పేద్దాం' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో రామ్ చరణ్ అప్‌డేట్‌కు సంబంధించిన ప్రకటన శనివారమే రాబోతుందని అర్థం అయింది.


Click it and Unblock the Notifications











