Klin Kara Birthday: మెగా ఫ్యామిలికి లక్కీ బేబీ క్లింకార ఫస్ట్ బర్త్ డే.. చిరంజీవిని కంటతడి పెట్టించిన ఆ క్షణం

మెగా ఇంటికి అదృష్టం వచ్చి ఏడాది అవుతుంది. ఏంటి అప్పుడే క్లింకారా పుట్టి ఏడాది అయిపోయిందా.. అంటే అవును.. మెగా వారసురాలు ఏడాది క్రితం ఇదే రోజున జన్మించింది. మెగా వారసుడుగా రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక 2012 లో చరణ్.. ఉపాసన కామినేని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి తరువాత చరణ్ లక్ మారిపోయింది. ఉపాసన.. మెగా కోడలుగా, మంచి భార్యగా, అపోలో అధినేతగా అన్ని చక్కదిద్దితూ మంచి పేరు తెచ్చుకుంది.

Ram Charan s daughter Klin Kaara Konidela turns 1 Upasana shares Video of Baby birth moments in hospital

పెళ్లి రోజు ఆమె లుక్స్ ను విమర్శించిన వారే.. ఆమె వ్యక్తిత్వానికి ముగ్ధులు అయ్యి అభిమానులుగా మారారు. ఇక 11 ఏళ్లు అయినా కూడా ఈ జంటకు పిల్లలు లేకపోవడంతో దాన్ని కూడా విమర్శించారు. ఉపాసనకు ఇక పిల్లలు పుట్టరనీ ట్రోళ్ళ చేశారు. ఆ ట్రోల్స్ ఆ జంటను ఎంత బాధపెట్టినా కూడా వారు మారు మాట్లాడకుండా తాము అనుకున్నదాని మీద నిలబడ్డారు.

అలా గతేడాది డిసెంబర్ లో ఉపాసన.. తాను ప్రెగ్నెంట్ అని అధికారికంగా తెలిపింది. ఇక ఉపాసన తల్లి కాబోతుంది అని తెలిసినప్పటి నుంచి చరణ్.. ఆమెను ఒక్క నిమిషం కూడా వదలకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు. గతేడాది జూన్ 20 న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్లింకారా రాకతో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ చిన్నారి పుట్టడంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. అంతేనా మెగా ఇంటికి అదృష్టమే ఈ చిన్నారి రూపంలో వచ్చింది. ఆమె ఇంటికి వచ్చిన ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీ లో అన్ని మంచి శుభాలే జరిగాయి.

Ram Charan s daughter Klin Kaara Konidela turns 1 Upasana shares Video of Baby birth moments in hospital

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం.. అలాగే పదేళ్ల పోరాటం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మేల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం అన్ని క్లింకారా వచ్చిన తర్వాత జరిగాయంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నేటితో క్లింకార జన్మించి ఏడాది అవుతుంది. మెగా వారసురాలు మొదటి పుట్టినరోజున తల్లితండ్రులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. క్లింకార పుట్టినప్పటి నుంచి వారిలో వచ్చిన మార్పులను చరణ్, ఉపాసన ఒక వీడియో ద్వారా తెలిపారు.

క్లింకార జన్మించే ముందు ఉపాసన హాస్పిటల్ కు వెళ్తున్న వీడియోను షేర్ చేస్తూ.. చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంతవరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఉపాసన ఫ్యామిలీ.. చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ సైతం క్లింకారా గురించి చెప్పుకొచ్చారు.

Ram Charan s daughter Klin Kaara Konidela turns 1 Upasana shares Video of Baby birth moments in hospital

పెళ్లి తరువాత నుంచి పిల్లలు ఎప్పుడు అని అందరూ అడుగుతుండేవారు. 11 ఏళ్ల తరువాత క్లింకార పుట్టడం, ఆమెను మొదటిసారి ఎత్తుకున్న క్షణం మర్చిపోలేననీ చరణ్ తెలిపాడు. క్లింకార రాక తమ జీవితాలలో మరింత సంతోషాన్ని తీసుకువచ్చిందంటూ ఉపాసన సైతం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక క్లింకారకు మెగా అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మరి ఈ చిన్నదాని ముఖం ఈరోజైనా చూపిస్తారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X