రామ్ చరణ్ ను మించి ఆస్తులు.. షాకింగ్ నెట్ వర్త్.. ఉపాసాన కొణిదెల సక్సెస్ జర్నీ ఇలా.!

మెగా కోడలిగా ఉపాసన కొణిదెల ఎంత గౌరవంగా మెదులుతున్నారో తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భార్యగా, మెగా స్టార్ చిరంజీవికి కొడలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తోంది. ఎంత పెద్దింటి కోడలైనా తన ప్రవర్తనలో ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటోంది. ప్రతి ఒక్కరి నుంచి ముఖ్యంగా మెగా అభిమానుల నుంచి ఉపాసన ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. అందే కాదండోయ్.. ఉపాసన కొణిదెల బిజినెస్ పర్సన్ కూడానూ.. 77 వేల కోట్లకు వారసురాలు... అపోలో ఆస్పత్రి బాధ్యతలను తానే చూస్తుండటం విశేషం.

2025 విమెన్స్ డే స్పెషల్ గా ఉపాసన కొణిదెల సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం... ఉపాసన కామినేని కేవలం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య మాత్రమే కాదు... రూ.77,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు కూడానూ. చెన్నైకి చెందిన హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సీ ప్రతాప్ రెడ్డి కూతురు. ఆమె తల్లి పేరు శోభనా కామినేని. వీరిద్దరూ అపోలో సంస్థలను నిర్వహిస్తున్నారు. ఉపాసన మొదటి నుంచే అపోలోని పలు డిపార్ట్ మెంట్లలో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చింది.

Ram Charan s Wife Konidela Upasana Shocking Net Worth Her Inspiring Success story is Here

మెగా కుటుంబంలో ఉత్తమ కోడలిగా ప్రశంసలు అందుకోవడమే కాకుండా... కార్పొరేట్ వరల్డ్ లోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వింగ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు చూస్తున్నారు. అలాగే ఎఫ్ హెచ్ పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సమగ్ర వెల్నెస్ ప్లాట్‌ఫామ్ అయిన UR.Lifeకు విజనరీ కూడానూ. అలాగే కేఈఐ గ్రూప్ వ్యవస్థాపకురాలిగా కూడా గుర్తింపు దక్కించుకుంది. ఉపాసన కొణిదెల నెట్ వర్త్ రూ.1,130 కోట్లుగా ఉంటుందని పలు నివేదికలు వెల్లడించాయి.

మెగా పరవ్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని సంయుక్తంగా రూ.2,500 కోట్లకు పైగా నెట్ వర్త్ ను కలిగి ఉంటారని తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమాల ద్వారా, ఇతర బిజినెస్ ల ద్వారా ఇప్పటి వరకు రూ.1,370 కోట్లు సంపాధించారు. మహిళ అయినప్పటికీ తనకున్న బిజినెస్ స్కిల్స్ తో ఉపాసన రూ.1,130 కోట్ల నెట్ వర్త్ ను సంపాదించుకుంది. అలాగే ఆమె రూ.77 వేల కోట్లకు ఏకైక వారసురాలు కావడం విశేషం. ఇలా దేశంలోనే సుసంపన్న జంటలలో ఒకటిగా వీరు నిలిచిపోయారు.

Ram Charan s Wife Konidela Upasana Shocking Net Worth Her Inspiring Success story is Here

ఉపాసన కొణిదెల ఎడ్యుకేషన్ లోనూ తన ప్రతిభ కనబర్చింది. లండన్‌లోని రీజెంట్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రశంస పత్రం అందుకుంది. ఆమె వరల్డ్ ఎడ్యుకేషన్ తో పాటు, వ్యవస్థాపక చతురతలో నైపుణ్యం సాధించింది. ఇలా గొప్పింటి కూతురైనా ఏమాత్రం ఖాళీగా ఉండకుండా.. కీలక బాధ్యతలను చేపట్టింది. పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం మాట రానివ్వకుండా అన్నీ తానై చూసుకుంటోంది. ఇలా అన్నింటా గొప్పగా వ్యవహరిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది ఉపాసన కొణిదెల. ఇక రెండేళ్ల కింద రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు క్లింకార జన్మించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే మెగా ప్రిన్సెస్ ఫేస్ ను తాత చిరంజీవి అభిమానులకు చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X