అరేయ్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ అడ్డుకుంటే ఖబర్దార్.. ఆర్జీవీ స్వీట్ వార్నింగ్
Recommended Video

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వస్తున్న సినిమాలపై వివాదాలు ఇటీవల మీడియాలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల హంగామా భారీగానే కనిపిస్తున్నది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలపై దర్శకుడు వర్మ చేస్తున్న కామెంట్లు మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇటీవల వర్మ చేసిన వ్యాఖ్యలు వైలర్ అవుతున్నాయి. అవేమిటంటే..

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిందెవరు?
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్‌ను దర్శకుడు వర్మ వినూత్నంగా చేస్తున్నారు. బాహుబలిని ఎవరు చంపారు అనే ట్యాగ్‌లైన్ మాదిరిగా ఎన్టీఆర్‌ను ఎవరు వెన్నుపోటు పొడిచారు అనే ప్రశ్నను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. చంద్రబాబు నాయుడు (సీబీఎన్) అనే విధంగా పోస్టును పెట్టడం అందర్నీ ఆకట్టుకొంటున్నది.

ఎన్టీఆర్‌ను అలా చేసిందెవరో చెప్పగలరా?
స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఎవరు వెన్నుపోటు పొడిచారో ఎవరైనా చెప్పగలరా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటూ ఓ ప్రశ్నను సోషల్ మీడియాలో వదిలారు. ఆ పోస్ట్ ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. విపరీతంగా షేర్ అవడంతోపాటు కామెంట్లు భారీగా వస్తున్నాయి.

అడ్డొస్తే ఖబర్ధార్ అని
ఇదిలా ఉండగా, లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి వర్మ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అరేయ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్‌కి ఎవరైనా అడ్డొస్తే ఖబర్ధార్ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. చేతిలో కత్తిపట్టుకొని పంచకట్టుకొన్న ఓ పోస్టర్‌ను తన ఫొటోతో మార్పింగ్ చేసి పోస్టు చేశారు. పోస్టు చేసిన కొద్ది వ్యవధిలోనే వేల మంది షేర్ చేశారు.

త్వరలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్
నందమూరి బాలకృష్ణ రూపొందించిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ వచ్చిన వెంటనే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తానని వర్మ పేర్కొనడం జరిగింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం వర్మ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లకు విశేష స్పందన వస్తున్నది.


Click it and Unblock the Notifications











