రేణు దేశాయ్‌ను కూడా వదలని వర్మ.. ఆమె నిజంగానే పవన్‌కు ఫోన్ చేస్తుందా.?

By Manoj

సినిమాల పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ... వివాదాల కారణంగా తన ప్రతిష్టను దిగజార్చుకుంటున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. మిగిలిన వారితో పోలిస్తే మెగా ఫ్యామిలీపై ఆయన తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పవన్ కల్యాణ్‌ను బాగా టార్గెట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడిపై 'పవర్ స్టార్' అనే చిత్రాన్నీ తెరకెక్కించాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ... పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌ను కూడా వదల్లేదు. ఓ విషయంలో ఆమెను పరోక్షంగా ప్రస్తావించాడు. ఆ వీడియో మీకోసం.!

 మొదటి నుంచీ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకే

మొదటి నుంచీ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకే

కొన్నేళ్లుగా కొందరు ప్రముఖులను టార్గెట్ చేసి సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు రాంగోపాల్ వర్మ. అయితే, అంతకంటే ముందే మెగా ఫ్యామిలీపై ఆయన తరచూ ఏదో ఒక కామెంట్ చేసి కలకలం రేపేవాడు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వర్మ... మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలకు వ్యతిరేకంగా ఎన్నో ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

 అప్పటి నుంచి పవన్‌పై ఫోకస్ పెట్టాడు

అప్పటి నుంచి పవన్‌పై ఫోకస్ పెట్టాడు

ఆర్జీవీ కామెంట్లు చేస్తున్న విషయం మెగా ఫ్యామిలీ దృష్టికి వెళ్లింది. దీంతో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు కొందరు యువ హీరోలు ఆయనకు కౌంటర్లు కూడా వేశారు. రోజులు గడిచే కొద్దీ ఆయనను పట్టించుకోవడమే మానేశారు. ఇక, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్‌పై బాగా ఫోకస్ చేశాడు వర్మ. ఈ క్రమంలోనే ఎన్నో రకాలుగా పోస్టులు పెడుతున్నాడు.

 పవన్ కల్యాణ్‌పై రాంగోపాల్ వర్మ సినిమా

పవన్ కల్యాణ్‌పై రాంగోపాల్ వర్మ సినిమా


ఇప్పటికే ఎన్నో వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ... తాజాగా ‘పవర్ స్టార్' అనే మూవీని తెరకెక్కించాడు. పవన్ కల్యాణ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడాయన. ఎన్నికల ఫలితాల తర్వాతి కథ అని చెబుతున్న ఈ సినిమాను జూలై 25న 11 గంటలకు తన సొంత ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్'లో రిలీజ్ చేస్తున్నాడు.

ట్రైలర్‌ లీక్.. డబ్బులిచ్చేస్తానన్న ఆర్జీవీ

ట్రైలర్‌ లీక్.. డబ్బులిచ్చేస్తానన్న ఆర్జీవీ


తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారి తన ‘పవర్ స్టార్' మూవీ ట్రైలర్ చూడ్డానికి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించాడు రాంగోపాల్ వర్మ. కానీ, ఊహించని విధంగా అది ముందే ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ విషయాన్ని వర్మ కూడా అధికారికంగా వెల్లడించాడు. అంతేకాదు, తమ ట్రైలర్‌ కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారందరికీ డబ్బులు తిరిగిచ్చేస్తామని వెల్లడించాడు.

రేణు దేశాయ్‌ను కూడా వదలని వర్మ


ట్రైలర్ ముందే లీక్ అవడంతో చేసేందేం లేక.. తమ వెర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశాడు ఆర్జీవీ. ముందుగా చూపించిన స్టిల్స్ ప్రకారమే ఇందులోనూ కొన్ని సీన్స్ జోడించాడు. అయితే, ఎవరూ అంచనా వేయని ఓ సీన్‌ను కూడా ఇందులో చూపించాడు వర్మ. అదే... పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు సంబంధించిన సీన్. ట్రైలర్‌లో ఇది కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు.

సార్.... పుణే నుంచి ఫోన్ వచ్చింది

సార్.... పుణే నుంచి ఫోన్ వచ్చింది

పవన్ కల్యాణ్ గెటప్‌లో ఉన్న హీరో.. ఇంట్లో తన రష్యన్ భార్యతో కలిసి ఉంటాడు. ఆ సమయంలో పవర్ స్టార్ బాడీగార్డ్ వచ్చి ‘సార్.. పుణే నుంచి ఫోన్' అంటూ మొబైల్ ఆయన చేతికి ఇవ్వబోతాడు. అప్పుడు ఆయన భార్య రష్యన్ భాషలో ఏదో అంటుంది. దీనికి హీరో స్పందిస్తూ ‘ఫోన్ చేసింది నేను కాదుగా' అంటూ సమాధానం చెబుతాడు.

Recommended Video

Parannageevi First Song | ఈ పాట RGV గనక వింటే అంతే సంగతి
ఆమె నిజంగానే పవన్‌కు ఫోన్ చేస్తుందా.?

ఆమె నిజంగానే పవన్‌కు ఫోన్ చేస్తుందా.?


పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, కొన్నేళ్ల క్రితం వాళ్లిద్దరూ విడిపోయారు కూడా. అప్పటి నుంచి ఇద్దరూ వేరు వేరుగానే ఉంటున్నారు. అయితే, రాంగోపాల్ వర్మ ట్రైలర్‌లో చూపించిన సీన్‌తో సరికొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో ఆమె నిజంగానే పవన్‌కు ఫోన్ చేస్తుందా అని కొందరు చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X