వర్మ టార్గెట్ పవన్ కాదు.. ఆ ముగ్గురే: ‘పవర్ స్టార్’ మూవీ అసలు కథ ఇదే.!

By Manoj Kumar P

విభిన్నమైన వ్యవహారశైలితో.. వివాదాస్పద సినిమాలతో తరచూ సంచలనం అవుతున్నాడు బడా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. అద్భుతమైన టాలెంట్‌తో అనతి కాలంలోనే టాప్ డైరెక్టర్ అయిపోయిన ఆయన... దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో సున్నితమైన అంశాలను హైలైట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు వర్మ. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'పవర్ స్టార్' అనే మూవీ చేస్తున్నాడు. దీని ద్వారా పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ మూవీలో అతడి టార్గెట్ పవర్ స్టార్ కాదని, ముగ్గురు సినీ పెద్దలని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

రాంగోపాల్ ఫోకస్ మొత్తం వాటిపైనే

రాంగోపాల్ ఫోకస్ మొత్తం వాటిపైనే

గొప్ప గొప్ప సినిమాలు తీసి టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు రాంగోపాల్ వర్మ. అయితే, కొన్నేళ్లుగా ఆయన సినిమాల ద్వారా... వ్యవహారశైలితోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు. మరీ ముఖ్యంగా రసవత్తరంగా సాగుతూ ఉండే ఏపీ పాలిటిక్స్‌పై వర్మ బాగా ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే కొందరిని టార్గెట్ చేసి సినిమాలు చేయడంతో పాటు పోస్టులు పెడుతున్నాడు.

 ఎవరూ అడ్డుకోకుండా సూపర్ ప్లాన్

ఎవరూ అడ్డుకోకుండా సూపర్ ప్లాన్

వర్మ సినిమాలు అంటేనే ఏదో ఒక రచ్చ జరుగుతుంటుంది. ఆయన తీసిన ‘రక్త చరిత్ర', ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రాల సమయంలో ఎన్ని గొడవలు జరిగాయో తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమాలు విడుదల కాకుండా చాలా మంది కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఈ నేపథ్యంలో ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేశాడు.

వర్మ కొత్త బిజినెస్.. లాభాలే లాభాలు

వర్మ కొత్త బిజినెస్.. లాభాలే లాభాలు

లాక్‌డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోయినా ఆర్జీవీ సినిమాలు మాత్రం తెరకెక్కిస్తూనే ఉన్నాడు. దీనికి కారణం అతడికి ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' అనే ఫ్లాట్‌ఫాం ఉండడమే. థియేటర్లు మూతబడిన సమయంలో ప్రేక్షకులందరూ ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకుని ఈ సంచలన దర్శకుడు ఇప్పటికే ‘క్లైమాక్స్', ‘నగ్నం' వంటి చిత్రాలను విడుదల చేశాడు.

మరో వివాదాస్పద చిత్రంతో ఆర్జీవీ

మరో వివాదాస్పద చిత్రంతో ఆర్జీవీ

ఇప్పటికే ఎన్నో వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ... ప్రస్తుతం ‘పవర్ స్టార్' అనే మూవీ చేస్తున్నాడు. పవన్ కల్యాన్‌ జీవితం ఆధారంగానే ఈ సినిమాను రూపొందించాడాయన. అంతేకాదు, అచ్చం పీకేలా ఉన్న వ్యక్తినే హీరోగా పెట్టాడు. నటులను కూడా అలాంటి వాళ్లనే దించాడు. కానీ, తాను ఎవరినీ ఉద్దేశించి ఈ మూవీ తీయలేదని చెబుతున్నాడు.

వాళ్లందరినీ దించి షాకిచ్చిన వర్మ

వాళ్లందరినీ దించి షాకిచ్చిన వర్మ

‘పవర్ స్టార్' మూవీతో మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు ఆర్జీవీ. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను కేవలం రెండు వారాల్లోనే పూర్తి చేసిన ఆయన... సినిమా స్టిల్స్‌ను ఒక్కొక్కటిగా వదులుతూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి, త్రివిక్రమ్, చంద్రబాబు నాయుడులను పోలిన వ్యక్తులను కూడా చూపించి మరో వివాదానికి తెరలేపాడు.

పవన్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేలా..

పవన్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేలా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకే వర్మ ఈ సినిమాను తీశాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికితోడు సినిమాను తన ఓటీటీలో విడుదల చేసి టికెట్ ధర ఎక్కువగా పెట్టడం... మొదటిసారి ట్రైలర్‌కు సైతం చార్జ్ చేయడం వంటివి వర్మ ప్లాన్‌ను వివరిస్తున్నాయి.

Recommended Video

Ladies Not Allowed Movie Trailer
ఆ ముగ్గురు పెద్దలే ఆర్జీవీ టార్గెట్

ఆ ముగ్గురు పెద్దలే ఆర్జీవీ టార్గెట్

‘పవర్ స్టార్' సినిమా ద్వారా ఆర్జీవీ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. అయితే, తాజా సమాచారం దీనికి భిన్నంగా వినిపిస్తోంది. ఈ సినిమా ద్వారా ముగ్గురు సినీ పెద్దలను ఆయన టార్గెట్ చేశాడట. వాళ్లు ముగ్గురూ పవన్‌ను తప్పుదారి పట్టించారని ఇందులో చూపించబోతున్నాడట వర్మ. గతంలో వాళ్ల పేర్లు కూడా పరోక్షంగా ట్వీటాడీ దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X