మహేష్‌బాబు మాదిరిగానే అందంగా.. దిమ్మతిరిగి.. మతిపోయింది.. వర్మ ట్వీట్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో తనదైన శైలిలో కామెంట్లు విసరడం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఎప్పడూ వివాదాస్పద కామెంట్లతోపాటు ఆసక్తికరమైన విషయాలను తన ట్విట్టర్‌లో పేర్కొంటారు. తాజాగా ప్రిన్స్ మహేష్‌బాబుపై ప్రశంసలు కురిపిస్తూ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు.

మహేష్‌బాబు మాదిరిగానే
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నిర్మించిన ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్‌ను సందర్శించాను. ఈ మల్టిప్లెక్స్ డిసెంబర్ 2న ప్రారంభం కానున్నది. థియేటర్లను చూస్తే దిమ్మ తిరిగిపోయింది. థియేటర్ వాతావరణం చూస్తే మతిపోయింది. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో.. ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ కూడా అంతే బ్యూటీఫుల్‌గా ఉంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఒకేసారి 1638 చూసే విధంగా
హైదరాబాద్‌లో నిర్మించిన ఏఎంబీ సినిమాస్‌లో ఏడు స్క్రీన్లు ఉంటాయి. ఒకేసారి 1638 మంది కూర్చుని సినిమా చూసే సామర్థ్యం ఉంది. ఇప్పటికే ఈ మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలనే కుతుహలం ప్రేక్షకుల్లో పెరిగింది.

3డీ టెక్నాలజీతో
గ్రాండ్ ఆడిటోరియంలో ఏడు స్క్రీన్లను అత్యున్నత సాంకేతికతతో రూపొందించారు. 3డీ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ప్రేక్షకులకు చక్కటి అనుభూతి అందించే విధంగా నిర్మించారు.

ఏషియన్ సంస్థతో మహేష్ కలిసి
ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో మహేష్‌బాబు అత్యాధునిక టెక్నాలజీ, సౌకర్యాలతో ఏఎంబీ సినిమాస్‌ను నిర్మించారు. ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్‌ను ఆదివారం (డిసెంబర్ 2న) రజనీకాంత్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.


Click it and Unblock the Notifications











