twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఆర్ రెహ్మాన్‌కు ఓ పంచ్ ఇద్దామనుకొన్నా.. రాంగోపాల్ వర్మ కోపానికి కారణమేమిటంటే

    |

    ఇంట్లో ఉంటే టీవీకి అత్తుకుపోతారు అనే కామెంట్లు అన్ని ఇళ్లలోనే సాధారణంగా వినిపిస్తుంటారు. అందుకు ఏఆర్ రెహ్మాన్ అతీతుడు కాదట. మ్యూజిక్ వదిలేసి కాలక్షేపం చేస్తుండటతో రాంగోపాల్ వర్మకు విపరీతమైన కోపం వచ్చిందంట. ఆ విషయాన్ని రంగీలా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా షేర్ చేసుకొన్నారు. ఇంతకు తనకు ఇష్టమైన మ్యూజిక్‌ను వదిలేసి వర్మ ఏం చేశారంటే..

    రంగీలా షూటింగ్ సమయంలో

    రంగీలా షూటింగ్ సమయంలో

    ఏఆర్ రెహ్మాన్‌తో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను రాంగోపాల్ వర్మ షేర్ చేసుకొంటూ 1995లో రంగీలా సినిమా షూటింగు నేను, ఏఆర్ రెహ్మాన్ గోవాకు వెళ్లాం. ఇద్దరం చెరో రూమ్‌లో ఉండిపోయాం. ఇంతకు ముందు చాలా మందితో పనిచేశాను. కానీ ఏఆర్ రెహ్మన్ మాత్రం ప్రత్యేకమైన, విభిన్నమైన వ్యక్తి. కోపతాపాలు ఎప్పుడూ కనిపించలేదు అని ఆర్జీవి కితాబిచ్చారు. కానీ ఓ విషయంలో మాత్రం నాకు ఆయన ముఖంపై పంచ్ ఇవ్వాలనంత కోపాన్ని తెచ్చారు అంటూ వర్మ తెలిపారు.

    సహనం కోల్పోయిన వర్మ

    సహనం కోల్పోయిన వర్మ

    ఏఆర్ రెహ్మాన్‌పై నా కోపానికి కారణం హై రామా పాటనే.. ఆ పాటను చిత్రీకరించడానికి అంతా సిద్దమయ్యాం. కానీ రెహ్మన్ మాత్రం పాటను అందించలేదు. దాంతో సహనం కోల్పోయిన వర్మ.. రెహ్మాన్‌ను నిలదీస్తే పాట లేట్ కావడానికి కారణం చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

    రేపు.. రేపు అంటూ ఆలస్యం చేయడంతో

    రేపు.. రేపు అంటూ ఆలస్యం చేయడంతో

    మేము గోవాకు వెళ్లిన రోజు నాతో మాట్లాడుతూ.. నేను సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఏదో చేస్తున్నాను. రేపు వినిపిస్తాననని అన్నారు. మరుసటి రోజు వెళ్లితే సాయంత్రం అన్నారు. ఆ తర్వాత మళ్లీ రేపు వినిపిస్తానని అన్నారు. కోపాన్ని ఆపుకోలేక రెహ్మాన్ నేను పాటను షూట్ చేయాలి. పాట లేకపోతే నేను ఏం చేయాలంటూ కోపంతో అరిచాను అని రాంగోపాల్ వర్మ చెప్పారు.

    నా గదిలో టీవీ లేకుండా చూడు..

    నా గదిలో టీవీ లేకుండా చూడు..

    తన పాట లేట్ కావడంపై రెహ్మన్ వివరణ ఇస్తూ.. రాము గారు.. మీకు ఓ చిన్న రిక్వెస్ట్.. ఎప్పుడైనా మీ సినిమాకు పనిచేస్తే.. పాటలు కంపోజింగ్ చేసేటప్పుడు నాకు టెలివిజన్ ఉన్న రూమ్‌ను మాత్రం ఇవ్వకు. రోజంతా టీవీ చూస్తూనే కాలం గడిపేశాను. అసలు పని చేయకుండా టీవీ చూస్తూనే ఉన్నాను అని రెహ్మాన్ చెప్పడం వర్మ ఆశ్యర్య పోయారట.

    రంగీలాకు 25 ఏళ్లు

    రంగీలాకు 25 ఏళ్లు

    రంగీలా 25 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ ఇంటర్యూలోని ముఖ్యంశాలను పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకొంటున్నారు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిల మతోద్కర్ నటించిన రంగీలా చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విశేషాలను ఇటీవల వర్మ తన సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకొన్నారు.

    English summary
    Director Ram Gopal Varma wanted to punch the AR Rahman at the time of Rangeela. Varma irritated make late of Hai Rama song by AR. In this occassion, Netizens reacted that If AR Rahman can fall for TV distractions, we are all just mere mortals.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X