Ramoji Rao: అనుకోకుండా ఆ హీరోను పరిచయం చేసిన రామోజీ.. ఇప్పుడు అతడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో తెలుసా?

రామోజీరావు.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతలా ఆయన సుదీర్ఘ కాలంగా వ్యాపారం, పత్రిక, సినిమా రంగాల్లో తనదైన ముద్రను వేస్తూ వచ్చారు. ఇలా దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ లెజెండరీ పర్సన్.. ఈరోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు.

దీంతో అంతటా విషాదఛాయలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో రామోజీరావు అనుకోకుండా ఓ హీరోను పరిచయం చేయడం.. అతడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారడం గురించి చిన్న కథనం మీరే చూడండి!

Ramoji Rao Unexpectedly Introduce Jr NTR as a Hero

ఉషాకిరణం అస్తమయం
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు రామోజీరావు (87) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవలే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ పరిస్థితుల్లో శనివారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించింది. దీంతో రామోజీరావు ఈరోజు ఉదయం 4.50 గంటలకు ఆస్పత్రిలోనే కన్నుమూశారు.

Ramoji Rao Unexpectedly Introduce Jr NTR as a Hero

తలచుకుంటున్నారుగా

దిగ్గజ వ్యాపారవేత్త రామోజీరావు మరణంతో దేశ వ్యాప్తంగా విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఇలా సెలెబ్రిటీలు, సామాన్యులు రామోజీరావు సేవలను తలచుకుంటూ సానుభూతిని తెలుపుతున్నారు.

సినిమా ప్రయాణం అలా
వ్యాపారం రంగంలో తనదైన ముద్రను వేసుకున్న రామోజీరావు.. 1984లో వచ్చిన 'శ్రీవారికి ప్రేమలేఖ' అనే చిత్రంతో నిర్మాతగా మారారు. అక్కడి నుంచి ఆయన ఎన్నో రకాల జోనర్లలో సినిమాలను నిర్మించారు. ఇలా ఇప్పటి వరకూ 85 చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అందులో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు ఉన్నాయి. అందుకే ఆయన నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు.

Ramoji Rao Unexpectedly Introduce Jr NTR as a Hero

వాళ్లను పరిచయం చేసి

సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో నిర్మాతగా తనదైన మార్కుకు చూపించిన రామోజీరావు.. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై చాలా మంది హీరోలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్ వంటి వాళ్లను స్టార్లుగా మారారు. ముఖ్యంగా తారక్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగి తనదైన రీతిలో దూసుకుపోతోన్నాడు.

Ramoji Rao Unexpectedly Introduce Jr NTR as a Hero

అనుకోకుండానే రిలీజ్
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమాతో పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఆ సినిమా అనివార్య కారణాలతో ఆలస్యం అయిపోయింది. ఫలితంగా తారక్ నటించిన 'నిన్ను చూడాలని' ముందుగా విడుదలైంది. దీన్ని రామోజీరావే నిర్మించారు. ఇలా అనుకోకుండానే ఎన్టీఆర్‌ను ఆయన సినీ రంగానికి పరిచయం చేయగా.. ఇప్పుడు బడా స్టార్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X