twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రంగమార్తాండ’ నుంచి అదిరిపోయే పోస్టర్.. ప్రకాష్ రాజ్‌తో కలిసి అలా షాకిచ్చిన రమ్యకృష్ణ

    |

    విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు నేడు (మార్చి 26). ఈ క్రమంలో ప్రకాష్ రాజ్‌కు సెలెబ్రిటీల నుంచి, ఆయన అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ కొత్త పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కేజీయఫ్ చాప్టర్ 2, రంగమార్తాండ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రెండు చిత్రాల పోస్టర్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

     చాలా గ్యాప్..

    చాలా గ్యాప్..

    కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ కాంబోలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అయితే మధ్యలో ఈ ఇద్దరికి కాస్త గ్యాప్ వచ్చింది. గోవిందుడు అందరివాడేలే సినిమాతో మళ్లీ ఒక్కటయ్యారు. అలా ఇప్పుడు ప్రకాష్ రాజ్‌ను మెయిన్ లీడ్‌గా పెట్టి రంగమార్తాండ అనే చిత్రాన్ని కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

    అదిరిపోయే క్యాస్టింగ్..

    అదిరిపోయే క్యాస్టింగ్..

    రంగమార్తాండ చిత్రంలో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ జంటగా నటించనున్నారు. అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం ఇలా భారీ తారాగణంతో కృష్ణవంశీ ప్రయోగం చేస్తోన్నాడు. మరాఠి చిత్రానికి రీమేక్‌గా రాబోతోన్న ఈచిత్రం కళలను ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్నారు.

    స్పెషల్ పోస్టర్..

    స్పెషల్ పోస్టర్..

    అయితే కృష్ణవంశీ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే కృష్ణవంశీ తనకెంతో ఇష్టమైన పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేశాడు. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ బర్త్ డే సందర్బంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు.

    భార్యాభర్తలుగా..

    భార్యాభర్తలుగా..

    ప్రకాష్ రాజ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన రమ్యకృష్ణ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. రంగమార్తాండ నుంచి ఈ ఇద్దరూ కలిసి ఉన్న స్టిల్‌ను షేర్ చేసింది. అలా మొత్తానికి ఈ ఇద్దరి ఫస్ట్ లుక్స్ ఇలా బయటపడ్డాయి. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ సహజత్వానికి దగ్గరగా కనిపిస్తున్నారు.

    English summary
    Ramya Krishnan Special wishes to Prakash raj From Rangamarthanda,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X