దాచాల్సిన వయసును ఇలా బయటపెట్టేసింది.. అసలు నమ్మేలా ఉందా? బర్త్ డే రోజున రమ్యకృష్ణ రచ్చ
రమ్యకష్ణ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ కాలంలో పాత ఫోటోలతో అభిమానులకు మంచి కిక్కిచ్చింది. ఈ మధ్యే బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్దమైంది. తాజాగా రిలీజ్ చేసిన సీరియల్ ప్రోమో, అందులో రమ్యకృష్ణ రాజసం, గంభీరత్వం మళ్లీ శివగామిని గుర్తుకు చేసేలా ఉంది. నేడు రమ్యకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటో ఎంతగా వైరల్ అవుతోందో.. ఆమె కామెంట్ అంతకంటే ఎక్కువగా వైరల్ అవుతోంది.

రమ్యకృష్ణ సందడి..
రమ్యకృష్ణ ఇప్పుడు పలు ప్రాజెక్ట్‌లతో సందడి చేస్తోంది. విజయ్ దేవరకొండ-పూరి కాంబోలో రాబోతోన్న ఫైటర్ చిత్రంలో రమ్యకృష్ణ ప్రత్యకమైన పాత్రలో నటిస్తోంది. ఇక రంగ మార్తాండ అంటూ కృష్ణవంశీ తెరకెక్కించబోతోన్న రీమేక్ ఓ స్పెషల్ క్యారెక్టర్ పోషించబోతోంది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా రచ్చ చేసేందుకు రెడీ అయింది.

షూటింగ్లకు రెడీ..
సుధీర్ఘమైన విరామం, లాక్ డౌన్ గ్యాప్ తరువాత షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు కలిగిన అనుభవాల గురించి చెప్పింది. ‘మీకు నాటి రోజులు గుర్తున్నాయా? వేసవి సెలవులు అయ్యాక స్కూల్‌కు వెళ్లాలంటే ఎలా ఫీలయ్యేవారో.. ప్రస్తుతం నాకు అదే ఫీలింగ్' అంటూ నటుల జీవితం, షూటింగ్స్ ఇలా ఉంటాయని ఆ మధ్య రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.

గ్రాండ్‌గా ప్రోమో..
రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రాబోతోన్న నాగభైరవి అనే కొత్త సీరియల్ ప్రారంభం కానుంది. త్వరలోనే ప్రారంభం కాబోతన్న ప్రకటిస్తూ రిలీజ్ చేసిన ప్రోమో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. నాగ సంపద, నాగదేవత, కాళ భైరవుడి, ఇలా ఫాంటసీ జానర్‌లో తెరకెక్కిన నాగ భైరవి సీరియల్‌లో రమ్యకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తోంది. మళ్లీ శివగామి రేంజ్ పాపులార్టీ వచ్చేట్టు కనిపిస్తోంది.
Recommended Video

యాభై యేళ్ల రమ్యకృష్ణ..
నేడు (సెప్టెంబర్ 15) రమ్యకృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరితో కలిసి కేక్ కట్ సెలెబ్రేట్ చేసుకుంది. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. తన వయసు యాభై సంవత్సరాలు అంటూ ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది. అయితే ఈ కామెంట్‌కు నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటి యాభై యేళ్లా? కానీ అలా లేరు కదా.. యంగ్ హీరోయిన్‌లా ఉన్నారంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


Click it and Unblock the Notifications











