సీమంతం వేడుకల్లో ‘శివగామి’!.. నెట్టింట రమ్యకృష్ణ ఫోటోలు వైరల్

తెలుగు తెరపై విలనిజాన్ని పండించడంలో విలక్షణ నటి రమ్యకృష్ణ. నీలాంబరి పాత్ర అయినా.. శివగామి లాంటి పాత్ర అయినా రమ్యకృష్ణ శైలే వేరు. నాటి తరం హీరోయిన్లలో రమ్యకృష్ణది విభిన్న ప్రయాణం. గ్లామరస్ రోల్స్, భక్తిరస చిత్రాలు, ఎమోషనల్ క్యారెక్టర్స్, నెగిటివ్ పాత్రలు చేసుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో ఎనలేని అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రమ్యకృష్ణ తన సత్తాను చాటుతోంది.

‘శివగామి'గా ఫుల్ ఫాలోయింగ్..

‘శివగామి'గా ఫుల్ ఫాలోయింగ్..

రమ్యకృష్ణ సినీ కెరీర్ అంతా ఒకెత్తు... బాహుబలి శివగామి పాత్ర ఒకెత్తు అనేలా నటించింది రమ్యకృష్ణ. శివగామి కేవలం ఇండియాలోనే కాదు దేశ విదేశాల్లోనూ రమ్యకృష్ణ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రమ్యకృష్ణ శివగామి పాత్ర తరువాత ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

 పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా..

పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా..

ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ 'రంగమార్తాండ', పూరి-విజయ్ దేవరకొండ చిత్రంలో, సాయి ధరమ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తోంది. మొత్తానికి రమ్యకృష్ణ ఫుల్ జోరుమీదుంది. కరోనా, లాక్ డౌన్ కారణంగా రమ్యకృష్ణ ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.

 వార్తల్లో నిలిచిన రమ్యకృష్ణ..

వార్తల్లో నిలిచిన రమ్యకృష్ణ..

లాక్ డౌన్ కాలంలో రమ్యకృష్ణ వివాదాస్పద వార్తల్లో చిక్కుకుంది. ఆమె కారులో భారీ మొత్తంలో మద్యం లభించడం చర్చనీయాంశమైంది. తమిళనాట కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సమయంలోమద్యంపై ఆంక్షలు పెట్టారు. అలాంటి సమయంలో కారులో మద్యం లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

నాటి జ్ఞాపకాల్లో..

నాటి జ్ఞాపకాల్లో..

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న రమ్యకృష్ణ.. పాత ఫోటోలను షేర్ చేస్తూ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తన అభిమానుల కామెంట్లకు ఓపిగ్గా సమాధానాలు కూడా ఇస్తోంది. తాజాగా రమ్యకృష్ణ తన పాత జ్ఞాపకాల్లో తేలిపోయింది. తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

 ఎంతో సంతోషంగా ఉంది..

ఎంతో సంతోషంగా ఉంది..

తన వలైకాపు సెరమెని (సీమంత వేడుకలు)కి సంబంధించిన ఫోటోలు అని, అందులో ఇద్దరు అత్తమ్మలున్నారని, అయితే వారిప్పుడు జీవించిలేరని తెలిపింది. నాటి ఫోటోలను, సంగతులను గుర్తు చేసుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

Recommended Video

Jagapathi Babu Opens Up On The Affair With Soundarya
నెట్టింట వైరల్..

నెట్టింట వైరల్..

మరో ఫోటోను షేర్ చేస్తూ.. మా అమ్మనే ఫోటోలు తీస్తోంది.. తన వెనుక ఉంది చూడండని తెలిపింది. ఇక ఈ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. పాత ఫోటోలు ఎంతో గొప్పగా ఉంటాయని, ఎన్నో స్మృతులను గుర్తుచేస్తాయని, చాలా అందంగా ఉన్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. రమ్యకృష్ణ-కృష్ణవంశీల వివాహం 2003లో అయిందని, వీరిద్దరికి రిత్విక్ అనే అబ్బాయి ఉన్నాడనే సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X