రానా, మిహిక పెళ్లి తర్వాత ఫస్ట్ ఫోటో వైరల్.. మ్యారేజ్ తర్వాత నవదంపతులు అలా..
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ ప్రేమికుల స్టేటస్ నుంచి నవదంపతులుగా మారిపోయారు. వీరిద్దరి వివాహం జూన్ 8వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత తొలి ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నది. రానా, మిహిక పెళ్లి, వారి కుటుంబ సంబురాల గురించి మరిన్ని విషయాలు..
Recommended Video

రామానాయుడు స్టూడియోలో పెళ్లి
రానా పెళ్లి సందర్భంగా రామానాయుడు స్టూడియోలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బయో సెక్యూర్ విధానంలో ముఖాలకు మాస్క్‌లు, సానిటైజర్లను విధిగా వాడారు. అతిథులందరికీ ముందే కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అతిథులు మినహాయించి మిగితావారెవరిని వేడుకలోకి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా
మిహిక బజాజ్ తల్లి బంటీ బజాజ్ వెడ్డింగ్ ప్లాన్ అనే విషయం తెలిసిందే. హైదరాబాద్, ముంబై, జైపూర్ లాంటి పట్టణాల్లో వెడ్డింగ్ ప్లానర్‌గా మంచి గుర్తింపు ఉంది. బంటీ బజాన్ ఇంటి పెళ్లి కావడంతో సంస్థ బృందం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్నారు. గత నెలరోజులుగా పెళ్లికి సంబంధించిన పనులను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేయడంలో శ్రద్దపెట్టారు.

పెళ్లి తర్వాత తొలి ఫోటో
పెళ్లి తర్వాత రానా, మిహికల ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. రానా కుర్తా, జీన్స్‌లో దర్శనమివ్వగా, సంప్రదాయ లహెంగా ఓణీలో మిహిక అందంగా కనిపించారు. రానా ఒడిలో వాలిపోయి కెమెరాకు ఫోజుస్తుండగా కెమెరా క్లిక్ అనిపించింది. ఈ నవదంపతుల ఫోటో ఇన్స్‌టాగ్రామ్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

పెంపుడు కుక్కతో నవదంపతులు
వివాహమనంతరం రానా తన ఇంటిలోకి మారినట్టు సమాచారం. తాజా ఫోటోలో తన భార్య మిహికతోపాటు పెంపుడు కుక్క కూడా వారితో ఫోటోలో కనిపించింది. ఇప్పుడు ఈ క్యూట్ ఫోటో అభిమానుల్లో జోష్ నింపింది. ఎప్పటి నుంచి పెళ్లి గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకూ రానా ఓ ఇంటివాడయ్యాడనే ఆనందం ఫ్యాన్స్, కుటుంబ సభ్యుల్లో మిగిలింది.

పెళ్లికి హాజరైన ప్రముఖులు వీరే
రానా, మిహిక బజాజ్ పెళ్లికి అతికొద్ది మాత్రమే హాజరయ్యారు. వెంకటేష్ దంపతులు, నాగచైతన్య దంపతులు, రాంచరణ్ దంపతులు, అల్లు అర్జున్ తదితరులు వేడుక వద్ద హడావిడిగా కనిపించారు. లాక్ డౌన్ కారణంగా పెళ్లిని అంగరంగ వైభవంగా చేయలేకపోయిన ఇరు కుటుంబాలు.. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత త్వరలోనే భారీ విందును ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











