ప్రభాస్, అనుష్కకు షాకిచ్చిన రానా.. పెళ్లిలో సమంతతో చైతూ చిలిపిగా.. వైరల్‌గా ఫోటోలు!

రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ పెళ్లి తర్వాత ఇంటిలో సంప్రదాయంగా సాగే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెళ్లి తర్వాత జరిగే ఇంట్లో శుభ వేడుకలను పూర్తి చేస్తున్నారు. నిరాడంబరంగా పెళ్లి జరిగినప్పటికీ.. ఇంట్లో నిర్వహించే ఆచారాలను, సంప్రదాయలను మర్వాడీ, తెలుగు సంప్రదాయాల ప్రకారం పూర్తి చేస్తున్నారు. తాజాగా రానా ఇంట్లో జరిగిన వేడుక గురించి మరిన్ని వివరాలు..

Recommended Video

Rana Daggunati Tied Knot With Miheeka Bajaj ఇంట్లో నుంచే పెళ్లిని చూసేలా దగ్గుబాటి ఏర్పాట్లు !
పెళ్లి తర్వాత ఫ్యామిలీ ఫోటో

పెళ్లి తర్వాత ఫ్యామిలీ ఫోటో


ఇక పెళ్లి తర్వాత కల్యాణ మంటపంలో ఫ్యామిలీ సభ్యులు దిగిన ఫోటో మరింత ఆకట్టుకొంటున్నది. రానా, మిహిక నవ దంపతులతో కలిసి అందరూ గ్రూప్ ఫోటోకు ఫోజిచ్చారు. వెంకటేష్, సురేష్ బాబు, నాగచైతన్య అందరూ ఆనందంలో మునిగిపోయిన క్షణాలను కెమెరా బంధించింది. ఇలాంటి ఫీల్‌గుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సత్యనారాయణ వ్రతంలో రానా, మిహిక

సత్యనారాయణ వ్రతంలో రానా, మిహిక


పెళ్లి తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం దాదాపు అందరి ఇంట్లో జరిగే వేడుకనే. రానా పెళ్లి తర్వాత దగ్గుబాటి కుటుంబం సోమవారం సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకొన్నారు. ఆ పూజకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఫ్యామిలి అంతా కలిసి ఫోటోకు ఫోజ్

ఫ్యామిలి అంతా కలిసి ఫోటోకు ఫోజ్


ఇక ఇంట్లో సత్యనారాయణ వ్రతం సందర్భంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దిగిన ఫోటో వైరల్‌గా మారింది. వెంకటేష్, సురేష్ బాబు దంపతులతోపాటు సమంత కూడా ఫ్యామిలీతో చేరిపోయారు. అయితే ఈ ఫోటో చైతూ మిస్ కావడం గమనార్హం. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్త్రృతంగా చక్కర్లు కొడుతున్నది.

సమంతతో చైతన్య చిలిపిగా

సమంతతో చైతన్య చిలిపిగా

రానా, మిహిక పెళ్లి ఒకవైపు జరుగుతుంటే మరో వైపు నాగచైతన్య చిలిపి పనులు చేస్తూ కెమెరాకు చిక్కారు. సమంత తలపై అక్షింతలు చల్లుతూ నాగచైతన్య కనిపించారు. సమంత మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా రానా పెళ్లి వేడుకను చూస్తూ అందులో లీనమైపోయారు.

ప్రభాస్, అనుష్కకు ఆహ్వానం ఇవ్వలేదట

ప్రభాస్, అనుష్కకు ఆహ్వానం ఇవ్వలేదట


ఇదిలా ఉండగా, రానా, మిహిక పెళ్లికి కేవలం 30 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. రాంచరణ్, అల్లు అర్జున్ మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. అయితే బాహుబలి టీమ్ ప్రభాస్, అనుష్కకు ఆహ్వానం ఇవ్వలేదనే విషయంపై మీడియాలో చర్చ జరుగుతున్నది. కోవిడ్ నిబంధనల కారణంగానే ఆ ఇద్దరి హాజరుకాలేదనే విషయాన్ని సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X