టాటూ వెనుకున్న అర్థం అదే.. గుట్టు విప్పిన మిహీక బజాజ్
మిహీక బజాజ్ ఈ పేరు గత కొన్ని రోజులుగా వింటూనే ఉంటున్నాం. మిహికపై వార్తలు రాని రోజంటూ లేదు. రానా తన ప్రేయసిగా మిహికను పరిచయం చేసిన దగ్గరి నుంచి తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. అసలీ మిహిక ఎవరు? ఎక్కడ ఎంటుంది? ఏం చేస్తుంటుంది? అని వెదుకులాట మొదలెట్టేశారు. ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. రానాను ప్రేమించేవారంతా మిహీకను ఫాలో అవ్వడం ప్రారంభించారు. మిహీక షేర్ చేసే ఫోటోలన్నీ క్షణాల్లో వైరల్ కావడం వెనుకున్న కారణం కూడా ఇదే. తాజాగా ఆమె మణికట్టుపై ఉన్న టాటూ అర్థం చెప్పింది.

మిహీక విశేషాలు..
మిహీక బజాజ్ తనకు యస్ చెప్పిందని రానా ప్రకటించిన క్షణం నుంచి గూగుల్ సర్చ్‌లో వేట మొదలైంది. మిహీక ఎవరై ఉంటారు? ఏం చేస్తుంటారని అంతా ఆత్రుతగా వెదికారు. వెడ్డింగ్ ప్లానర్, ఈవెంట్‌లు చేసే మిహీక.. వెంకటేష్ కూతురు ఆశ్రీత స్నేహితురాలు. చాలా కాలం నుంచే మిహీక పరిచయం ఉన్నా కూడా లాక్‌డౌన్‌కు ముందు మాత్రమే ప్రేమ మొదలైందని మంచు లక్ష్మీ చేసిన లైవ్ ఇంటర్వ్యూలో చెప్పేశాడు.

రోకా ఘనంగా రోకా ఈవెంట్..
నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన విషయాలను చర్చించుకోవడానికి ఇరు కుటుంబాలు ఒక చోట కలవడమే ఈ రోకా ఈవెంట్. ఈమేరకు రానా, మిహిక కుటుంబాలు రామానాయుడు స్టూడియోలో సమావేశమయ్యాయి. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, సంప్రదాయ దుస్తుల్లో రానా, మిహికలు ఎంతగా ఆకట్టుకున్నారో అందరికీ తెలిసిందే.

మిహీక పచ్చబొట్టు..
పచ్చబొట్టు పొడిపించుకోవడమనేది ప్రేమకు చిహ్నం. జీవితాంతం ఉండిపోయే టాటూనే ప్రేమకు ప్రతిరూపంగా చూస్తారు. మిహీక సైతం ఓ టాటూను వేయించుకుంది. ఈ టాటూలో R (రానా) M (మిహీక) అనే రెండక్షరాలున్నాయి. అయితే ఈ టాటూకు సంబంధించిన వార్తలు గత రెండు రోజులుగా తెగ వైరల్ అవుతున్నాయి.
Recommended Video

అర్థం చెప్పిన మిహీక..
అయితే తాజాగా మిహీక ఆ టాటూ వెనుకున్న అర్థం చెప్పింది. మ్యాథమెటిక్స్‌లో ఇన్ఫినిటీ సింబల్ (Ꝏ) అందరికీ తెలిసే ఉంటుంది. అనంతం అని అర్థం వచ్చే ఆ సింబల్‌లో R, M అక్షరాలను ఇరికించారు. తమది కూడా అనంతమైన ప్రేమ అని అర్థ: వచ్చే విధంగా ఆ టాటూను డిజైన్ చేశారు. ఈ మేరకు మిహీక తన మణికట్టు మీదున్న టాటూను షేర్ చేస్తూ.. రానా, మిహీకల అనంత ప్రేమకు చిహ్నమైన టాటూ అని కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











