ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించనున్న దగ్గుబాటి రానా.. మరో అస్త్రం సిద్ధం!
Recommended Video

విభిన్న పాత్రలతో రానా దూసుకుపోతున్నాడు. స్టార్ ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టినా రానా ఎప్పుడూ కమర్షియల్ సినిమాపై ఆధారపడలేదు. తన నటనతోనే ప్రశంసలు అందుకుంటున్నాడు. బాహుబలి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన జాతీయ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా రానాకు లీడర్, నేనే రాజు నేనే మంత్రి లాంటి పొలిటికల్ చిత్రాలు ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చిపెడుతున్నాయి. ఆ రెండు చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. మరో మారు పొలిటికల్ కథతో రానా ప్రయోగం చేయబోతున్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2010 లో వచ్చిన లీడర్ చిత్రం మంచి విజయం సాధించింది. నటన పరంగా రానాని మరో స్థాయికి చేర్చిన చిత్రం అది. ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రక్రియ ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఎన్నికలకు ముందు
2019 లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా శేఖర్ కమ్ముల లీడర్ 2 కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో వచ్చే ఈ చిత్రం అప్పటి పొలిటికల్ వాతావరణానికి సరిపోయేలా ఉంటుందని అంటున్నారు.

చిన్న మార్పులు
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల కథ సిద్ధం చేసి రానాకు వినిపించాడట. కొన్ని చిన్న మార్పులు సూచించి రానా కథని ఓకే చేసినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ నుంచి
ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవాకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లీడర్ 2 తో రానా ఏమేరకు ప్రభావం చూపుతాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











