Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్‌తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గుడ్ న్యూస్ చెప్పి కన్ఫ్యూజన్లో పడేసిన రానా.. ఆ హీరోల ఇంట్లో పెళ్లి గోల!
టాలీవుడ్ లో ఒక స్పెషల్ పెళ్లి కళ కనిపిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలోనే నలుగురు సెలబ్రెటీలు పెళ్లి విషయాలతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. రానా దెబ్బకు చాలా మందికి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంతకాలం పెళ్లి అంటే భయపడిన బాహుబలి విలన్ ఇప్పుడు బాహుబలిని కూడా సందిగ్ధంలో పడేశాడు. నితిన్, నిఖిల్ కూడా తాళి కట్టడానికి సిద్ధమవ్వగా ఎవరు ఊహించని విధంగా దిల్ రాజు రెండో వివాహం చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు.
Recommended Video
ప్లాన్ రెడీ..
యువ హీరో నిఖిల్ లాక్ డౌన్ ముందు రోజు వరకు పెళ్లి పనులలో కాస్త బిజీగా ఉన్నాడు. ఆల్ మోస్ట్ పత్రికలు కూడా రెడీ చేశారు. మరో వైపు నితిన్ అయితే విదేశాలకు వెళ్లి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ప్లాన్ కూడా రెడీ చేసుకున్న తరుణంలో ఇద్దరికి షాక్ తగిలింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్లాన్ తారుమరవ్వగా ఇప్పుడు కొత్త ప్లాన్ వేశారు. కుటుంబ సభ్యుల మధ్యలోనే వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారు.
షాకిచ్చిన రానా.. కూల్ దిల్ రాజు..
దిల్ రాజు చాలా సింపుల్ గా సొంత ఊరిలో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా కూల్ గా మ్యారేజ్ పనులను ఫినిష్ చేసుకున్నాడు. అయితే రానా మాత్రం షాకిచ్చాడు. సడన్ గా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ ట్వీట్ చేయడంతో న్యూస్ వైరల్ అయ్యింది. మిహికాతో ఇక బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.
కొంప ముంచిన రానా..
ప్రస్తుతం సోషల్ మీడియాలో రానా పెళ్లికి సంబంధించి అనేక రకాల మీమ్స్ వస్తున్నాయి. ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ బ్యాచ్ తో సరదాగా గడిపిన రానా మొత్తానికి తన పెళ్లి గురించి చెప్పి స్నేహితులకు షాక్ ఇచ్చాడు. అప్పట్లో వరుణ్ తేజ్ అయితే నితిన్, రానా మా బ్యాచిలర్ లైఫ్ కి ఒక ప్రేరణ అంటూ వారిని ఫాలో అయ్యాడు. ఇక ఇప్పుడు వాళ్లిద్దరూ సెట్టవ్వడంతో శర్వానంద్, రామ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారి ఇళ్లలో కూడా పెళ్లి గోల మొదలయ్యాయనే కామెంట్స్ వస్తున్నాయి.
బాహుబలి పరిస్థితేంటి?
యంగ్ హీరోలలో కొంతమంది 30లోకి వచ్చేశారు. రేపో మాపో వారి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు కూడా ఒత్తిడి తెస్తారు. ఇక ప్రభాస్ మాత్రం 40లోకి వచ్చినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. మొత్తానికి రానా సెట్టయ్యాడు. ఇక అందరి చూపు ఇప్పుడు ప్రభాస్ పైనే పడుతుంది. మరి ప్రభాస్ ఇంట్లో వాళ్లకు ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.