పెళ్లి గంటలు మోగాయ్.. అన్ని విషయాలు వెల్లడించిన మిహీక.. వెరైటీ వెడ్డింగ్ కార్డ్!!

దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటి వాడు కాబోతోన్నాడు. టాలీవుడ్ మెస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లోంచి రానా తప్పుకోబోతోన్నాడు. ఆగస్టు 8న రానా తన ప్రేయసి మిహీకా బజాజ్‌తో వివాహం జరగబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అందరికీ ఇంత వరకే తెలియగా.. మిహీకా తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది. పెళ్లి ఎక్కడ, అతిథులు ఎవరు? పెళ్లి తరువాతి కార్యక్రమాలు ఏంటి? ఇలా అన్నింటితో పాటు అసలు వారికి ఎలా పరిచయమైంది అనే విషయాన్ని కూడా వెడ్డింగ్ కార్డ్‌లో పెట్టేశారు. అయితే ఇప్పుడు డిజిటల్ యుగం కాబట్టి వీటన్నంటిని ఓ వీడియో రూపంలో చేసి అందరికీ పంపించబోతోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Recommended Video

Rana Miheeka Bajaj Wedding Invitation Card Video Viral || Oneindia Telugu
 అకస్మాత్తుగా ప్రకటన..

అకస్మాత్తుగా ప్రకటన..

రాన తన ప్రేయసి వివరాలను ఆకస్మాత్తుగా బయటకు వెల్లడించాడు. తను యస్ చెప్పిందని మిహీక ఫోటోను మొదటి సారిగా షేర్ చేశాడు. ఇక అప్పటి నుంచి తెలుగు వారు మిహీక గురించి తెలుసుకోవడం, ఆమెను ఫాలో అవ్వడం చేస్తూ వచ్చారు.

మిహీక విశేషాలు..

మిహీక విశేషాలు..

వెడ్డింగ్ ప్లానర్, ఈవెంట్‌లు చేసే మిహీక.. వెంకటేష్ కూతురు ఆశ్రీత స్నేహితురాలు. చాలా కాలం నుంచే మిహీకతో రానాకు పరిచయం ఉంది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలోనే ప్రేమ ఎక్కువైందని, పెళ్లి గురంచి ఆలోచించామని చెప్పుకొచ్చాడు.

 రోకా వేడుకతో హల్చల్..

రోకా వేడుకతో హల్చల్..

నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన విషయాలను చర్చించుకోవడానికి ఇరు కుటుంబాలు ఒక చోట కలవడమే రోకా ఈవెంట్. ఈమేరకు రానా, మిహిక కుటుంబాలు రామానాయుడు స్టూడియోలో మే 21న సమావేశమయ్యాయి. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, సంప్రదాయ దుస్తుల్లో రానా, మిహికలు ఎంతగా ఆకట్టుకున్నారో అందరికీ తెలిసిందే.

 వెడ్డింగ్ కార్డ్..

వెడ్డింగ్ కార్డ్..

అప్పటి నుంచి రానా-మిహీకల వార్తలు సోషల్ మీడియాలో మరింతగా వైరల్ కాసాగాయి. ఇక పెళ్లి ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మిహీక వెడ్డింగ్ కార్డ్‌కు ఇన్విటేషన్ వీడియోను షేర్ చేసింది. అందులో ప్రతీ ఒక్క విషయాన్ని పొందుపర్చారు.

వేదిక ఎక్కడంటే..

వేదిక ఎక్కడంటే..

రానా మిహీకాల వివాహం ఆగస్టు 8న అని మధ్యాహ్నాం 2 గంటలకు ముహూర్తం అని పేర్కొన్నారు. ఖాజాగూడలోని చైతన్య ఎంక్లేవ్‌లో వివాహ మహోత్సవ వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే పెళ్లి అనంతం రిసెప్షన్, సెరెమోని, పార్టీ అంటూ మూడు రకాల ప్రోగ్రామ్స్‌ను ఏర్పాటు చేశారు.

లవ్ స్టోరీ చెప్పేశారు..

లవ్ స్టోరీ చెప్పేశారు..

రానా-మిహీకలకు మొదట ఎప్పుడు పరిచయం జరిగిందని విషయాన్ని కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోలోనే పెట్టారు. మొదటగా ఎప్పుడు కలిశారు.. ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగిందని విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ మేరకు వీరిద్దరు జూన్ 10, 2103 కలిసినట్టు తెలుస్తోంది.

అతిథులు వీరే..

అతిథులు వీరే..

రానా మిహీక వివాహానికి పెద్ద ఎత్తున అతిథులు హాజరు కాబోతోన్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఈ వీడియోలో టాలీవుడ్ సెలెబ్రిటీల ఫోటోలను కూడా షేర్ చేశారు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంటూ మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్, కమల్ హాసన్ ఇలా ఎంతో మంది ఫోటోలను షేర్ చేశారు. అయితే వీరంతా పెళ్లి హాజరుకాబోతోన్నారన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X