Rana Miheeka Wedding: పెళ్లికి హాజరయ్యే క్లోజ్ ఫ్రెండ్స్, అతిథుల జాబితా ఇదే
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి పెళ్లికి ప్రముఖ సినీ స్టూడియో రామానాయుడులో అన్ని ఏర్పాట్లు పూర్తయాయి. తొలుత రానా, మిహికల పెళ్లిని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించాలని అనుకొన్నప్పటికీ ఆ తర్వాత కరోనావైరస్ కారణంగా తమ స్టూడియోలోనే నిర్వహించేందుకు వేదికను ముస్తాబు చేశారు. శనివారం రాత్రి జరిగే పెళ్లికి ఎవరెవరూ హాజరవుతున్నారంటే..

అతి నిరాడంబరంగా పెళ్లి
రానా పెళ్లికి కొవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా కేవలం 30 మందిలోపే గెస్టులు ఉండేలా నిర్మాత సురేష్ బాబు చర్యలు తీసుకొన్నారు. అతి కొద్ది మంది ముఖ్యమైన కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించినట్టు సమాచారం. కరోనా పరిస్థితుల ప్రభావం తగ్గిన తర్వాత పరిశ్రమ, వ్యాపార వర్గాలకు విందును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

అక్కినేని ఫ్యామిలీతో దగ్గుబాటి కుటుంబం
రానా పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ సందడి చేయనున్నారు. దగ్గుబాటి కుటుంబానికి అక్కినేని ఫ్యామిలీ అతిథులు కాక ఫ్యామిలీ సభ్యులుగానే గుర్తించాలి. ఇప్పటికీ రానా ఫ్యామిలీతో కలిసి సమంత అక్కినేని వేడుకల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతోపాటు అఖిల్ అక్కినేని కూడా ఈ పెళ్లికి హాజరవుతున్నట్టు సమాచారం.

రాంచరణ్, ఉపాసన దంపతులు
రానా, మిహిక బజాజ్‌కు అత్యంత సన్నిహితులుగా రాంచరణ్, ఉపాసన దంపతులకు పేరుంది. దగ్గుబాటి, కొణిదెల కుటుంబాలకు మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రానా, రాంచరణ్ మధ్య స్కూల్ నుంచి స్నేహం ఉంది. ముఖ్యంగా రాంచరణ్, ఉపాసనతోపాటు మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

మంచు లక్ష్మీ హజరయ్యే అవకాశం
సినీ ఇండస్ట్రీలోని ఫ్యామిలీలో రానాకు అత్యంత సన్నిహితురాలిగా లక్ష్మి మంచుకు గుర్తింపు పొందారు. రానా గురించి ఎక్కువగా మీడియాలో లక్ష్మీ మంచు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రానా పెళ్లి కుదిరిందని తెలిసిన వెంటనే తొలి ఇంటర్వ్యూ చేసింది మంచు లక్ష్మీనే. ఈ క్రమంలో లక్ష్మి కూడా పెళ్లికి హజరయ్యే జాబితాలో ఉంటారు.
Recommended Video

రానా పెళ్లికి రాజమౌళి దూరం
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనకు ఇష్టమైన రానా పెళ్లికి దూరంగా ఉంటున్నారు. కరోనావైరస్ బారిన పడి స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నందున ఈ పెళ్లికి హాజరుకావడం లేదని తెలిసింది. కరోనా నుంచి బయటపడిన తర్వాత రానాను కలిసి స్వయంగా జక్కన్న శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉంది. బాహుబలి చిత్రంలో భళ్లాలదేవ పాత్ర ద్వారా రానాకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











