Animal Movie: నాని మీద యానిమల్ దెబ్బ... రణబీర్ రివేంజ్ మామూలుగా లేదుగా!

ఈ వారం పెద్ద సినిమాలు థియేటర్ వద్దకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సిినిమాపై ప్రీ రిలీజ్ తర్వాత హైప్ ఎక్కువ అయిపోయింది. దానికి కారణం రాజమౌళి, మహేశ్ బాబు వంటి స్టార్స్ వచ్చి సినిమాకు మద్దతుగా నిలిచారు. దీంతో తెలుగు రిలీజ్ కాబోతున్న నాని హాయ్ నాన్న సినిమాపై గట్టిగానే దెబ్బ పడిందని తెలుస్తోంది. అంతే కాదు నితిన్ ఎక్స్ ట్రా ఆర్డీనరి సినిమాపై కూడా ఈ ఎఫెక్ట్ పడనుంది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఫ్యాన్స్ ఇది కదా అసలైనా రివేంజ్ అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు సంగతి ఏంటో స్టోరీలో తెలుసుకుందాం.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగా అర్జున్ రెడ్డి తర్వాత తెరకెక్కించిన సినిమా యానిమల్. ఈ సినిమా అర్జున్ రెడ్డి కంటే వంద రేట్లు వైల్డ్ గా ఉంటుందని ముందు నుంచి చెప్పుకువచ్చాడు సందీప్. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

Ranbir Kapoor Animal Movie Effecting on Nani HI Nanna, Nithiin Extra Ordinary Man Full Details Here

ఇక ఈ సినిమా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ లో జరుపుకుంది. ఇక ఈ ఈవెంటుకు దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ మహేశ్ బాబు గెస్టులుగా వచ్చి మరింత హైప్ ను ఇచ్చారు. ట్రైలర్ చూసి మెంటల్ ఎక్కిపోయిందని మహేశ్ బాబు అనడం మరింత హైప్ ను తీసుకువచ్చింది. ఇక ఈ మూవీకి తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో సెన్సేషన్ హిట్ కాబోతుందని తెలుస్తోంది.

Ranbir Kapoor Animal Movie Effecting on Nani HI Nanna, Nithiin Extra Ordinary Man Full Details Here

అయితే ఈ యానిమల్ దెబ్బ తెలుగు సినిమాలపై గట్టిగానే పడబోతుందని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా హాయ్ నాన్న చిత్రం తెరకెక్కింది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇక శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక హేషమ్ అబ్దుల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.

Ranbir Kapoor Animal Movie Effecting on Nani HI Nanna, Nithiin Extra Ordinary Man Full Details Here

ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై యానిమల్ ఎఫెక్ట్ పడనుందని అర్థం అవుతుంది. సందీప్ రెడ్డి వంగా యానిమల్ కు మంచి టాక్ వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులు రన్ అయ్యే అవకాశం ఉంది. ఇక యానిమల్ రిలీజ్ అయిన వారానికే హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డీనరి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఆ ఎఫెక్ట్ ఈ సినిమాలపై పడనుంది. జనాలు ఏ సినిమా బాగుంటే అదే సినిమాకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం ఇదే కదా అసలైన రివేంజ్ అంటున్నారు. దానికి కారణం ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే. బహుబలి సీరిస్ తర్వాత పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు బాలీవుడ్ కు ఛాన్స్ ఇవ్వకుండా రికార్డులు కొల్లగొట్టాయి. దీంతో అక్కడి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు రణబీర్ కపూర్ ఆ రివేంజ్ తీర్చుకుంటున్నాడు అని బాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. హాయ్ నాన్న మరో వారం ఆగి వస్తే బాగుండని అంటున్నారు తెలుగు ఫ్యాన్స్. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X