నిన్న అలా నేడు ఇలా.. ఫీల్ గుడ్ సాంగ్స్‌తో దేవీ శ్రీ ప్రసాద్ రచ్చ
దేవీ శ్రీ ప్రసాద్ పాటలు ఒకప్పుడు యువతను ఊపేశాయి. ప్రేమజంటలు కచ్చితంగా దేవీ శ్రీ ప్రసాద్ పాటలు పాడుకుంటూ ప్రేమలో మునిగిపోవాల్సిందే. అంతేకాకుండా మాంచి ఊపున్న పార్టీల్లో బాక్సులు దద్దరిల్లిపోయేలా మోత మోగాలంటే దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఐటెం సాంగ్స్ ఉండాల్సిందే. అలా దేవీ శ్రీ ప్రసాద్ హవా దశాబ్దానికి పైగా నడిచింది. ఈ మధ్య దేవీ క్రేజ్ కాస్త తగ్గినట్టు కనిపించింది.
తమన్ అందించిన సంగీతం, పాటలు బాగా పాపులర్ అవ్వడం అదే సమయంలో దేవీ శ్రీ ప్రసాద్ ఆల్బమ్స్ అంతగా వర్కవుట్ కాకపోవడంతో రాక్ స్టార్ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. కానీ అలాంటి వారికి దేవీ శ్రీ ప్రసాద్ ఉప్పెన పాటలతో ఊపిరిపోశాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన నీ కళ్లు నీలి సముద్రం, దక్ దక్ దక్ అనే పాటలు క్లిక్ అయ్యాయి. నిన్న రిలీజ్ చేసిన రంగులద్దుకుందాం అనే పాట అందర్నీ ఆకట్టుకుంది.

తాజాగా రంగ్ దే చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. ఏమిటో ఇది అంటూ చాలా రోజుల తరువాత మంచి రొమాంటిక్ పాటను వినిపించాడు. మొత్తానికి దేవీ శ్రీ ప్రసాద్ మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. ఈ రెండు ఆల్బమ్స్ ది బెస్ట్ అవుతాయని సోషల్ మీడియాలోకామెంట్లు చేస్తున్నారు. రంగ్ దే చిత్రంలో నితిన్ కీర్తి సురేష్ కెమిస్ట్రీ, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











