‘చెక్’కోసం ‘రంగ్ దే’ టీం.. క్రేజీ ప్రమోషన్స్!
నితిన్ ప్రస్తుతం తన చెక్ సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేసుకునే పనిలోనే ఉన్నాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీ కోసం నితిన్ బాగానే కష్టపడుతున్నాడు. అంతే కాకుండా చెక్ ప్రమోషన్స్ కోసం రంగ్ దే టీంను కూడా వాడేసుకున్నాడు. కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, వెంకీ అట్లూరి ఇలా రంగ్ దే టీం చెక్ ప్రమోషన్స్‌లో క్రేజీగా నటించేశారు. ఈ ముగ్గురు చేసిన ఫన్‌లో నితిన్ కూడా జాయిన్ అయ్యాడు.
వెన్నెల కిషోర్, వెంకీ అట్లూరి ఇద్దరూ కూడా చెస్ ఆడుతుంటారు. మధ్యలో కీర్తి సురేష్ ఆట గురించి చెబుతూ ఉంది. ఏనుగు అంత లావుగా ఉంటుంది.. అలాంటప్పుడు అక్కడి నుంచి ఇక్కడకు ఎలా జంప్ చేస్తుంది.. ఒక్కొక్క స్టెప్ మాత్రం వస్తుందంటూ వెన్నెల కిషోర్ కామెంట్ చేశాడు. అది అలానే వస్తుందంటూ కీర్తి సురేష్ కౌంటర్ వేసింది. ఇక అమాయకంగా వెంకీ అట్లూరి ఆట గురించి తెలీనట్టుగానే ఉన్నాడు.

అయితే వెన్నెల కిషోర్ చెక్ మేట్ చేసేసి..అవుట్ అని అంటాడు. అది అవుట్ కాదు.. చెక్ అనాలి అని చెబుతుంది కీర్తి సురేష్. ఇలా అందరూ చెక్ చెక్ అని అంటుంటే.. నితిన్ కూడా ఎంట్రీ ఇస్తాడు. అలా తన సినిమా చెక్ గురించి మాట్లాడుకుంటారు. చెక్ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాబోతోందంటూ రంగ్ దే టీం స్పెషల్‌గా ఇలా క్రేజీ ప్రమోషన్స్ చేసింది. రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ నటించిన ఈ చిత్రాన్ని చంద్ర శేఖర్ యేలేటి తెరకెక్కించాడు.


Click it and Unblock the Notifications











