దీపిక-రణవీర్ పెళ్లి తేదీ వెనక రహస్యం ఇదే...
బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకోన్, రణవీర్ కపూర్ నవంబర్ 14, 15 తేదీల్లో తమ వివాహ వేడుక జరుగబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 15న పెళ్లి డేట్ ప్రకటించడం వెనక ప్రత్యేక కారణం ఉందట.
దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ మధ్య ప్రేమ మొదలవ్వడానికి కారణం 'రామ్-లీలా' చిత్రం. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే ఇద్దరూ దగ్గరయ్యారు. ఈ సినిమా తర్వాత బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాల్లో నటతించారు. అలా మొదలైన వీరి ఎఫైర్ పెళ్లి వరకు వచ్చింది.

వచ్చే నవంబర్ 15తో వీరి తొలి చిత్రం 'రామ్-లీలా' విడుదలైన సరిగ్గా 5 సంవత్సరాలు పూర్తి కానుంది. కాకతాళీయమో? లేక కావాలని ఫిక్స్ చేశారో కానీ వీరి పెళ్లి వేడుకలో రామ్ లీలా సెలబ్రేషన్ కూడా నిర్వహించబోతున్నారని టాక్.
కాగా... వీరి పెళ్లి వేడుక రెండు సాంప్రదాయాల్లో జరుగనుందట. దీపిక పదుకోన్ బెంగుళూరు అమ్మాయి కావడంతో సౌత్ సాంప్రదాయం ప్రకారం.... రణవీర్ సింగ్ మహారాష్ట్ర సింధి వంశానికి చెందిన వాడు కావడంతో ఆ సాంప్రదాయం ప్రకారం వేర్వేరుగా పెళ్లి వేడుక జరుగనుందట.


Click it and Unblock the Notifications











