For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ గురించి చెప్పాలంటే పదాలు సరిపోవు.. రాశీ ఖన్నా ఎమోషనల్

    |

    ప్రస్తుతం రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం గోవాలో షూటింగ్‌ చేస్తూ బిజీగా ఉంది. మధ్యలో దొరికే గ్యాప్‌ను ఫుల్లుగా వాడేస్తోంది. నిన్న రాశీ ఖన్నా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రాశీ ఖన్నా బికినీ ఫోటోలను షేర్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు బొద్దుగా, లావుగా ఉండే తాను ఇప్పుడు ఇలా బికినీ ధరించే ఆకృతిలోకి వచ్చానంటూ ఎంతో గొప్పగా చెప్పకొచ్చింది.

    అలా ఆ షేప్‌లోకి రావడానికి, జీరో సైజ్‌లోకి వచ్చేందుకు ఎంతగా కష్టపడిందో, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాల్సి వచ్చిందో అన్నీ వివరించింది. అయితే రాశీ ఖన్నా ఇలా సినిమాలు, సోషల్ మీడియాకు ఎంత టైం కేటాయిస్తుంటుందో ఫ్యామిలీకి కూడా అంతే సమయాన్ని కేటాయిస్తుంటుంది. ఆ మధ్య రాశీ ఖన్నా తన బర్త్ డే, చెల్లి పెళ్లి కోసం షూటింగ్‌లను క్యాన్సిల్ చేసుకుని కుటుంబ సభ్యులతో గడిపేసింది.

     rashi khanna About her brother birthday

    అయితే రాశీ ఖన్నాకు ఓ సోదరుడున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో తాజాగా రాశీ ఖన్నా చేసిన పోస్ట్‌ను చూస్తే తెలుస్తుంది. హ్యాపీ బర్త్ డే బెస్ట్ బ్రదర్.. రౌనక్ ఖన్నా.. నువ్వంటే నాకు ఎంతిష్టమో, ఎంత ప్రాణమో ఎన్నో సార్లు చెప్పాను.. అయినా నీపై ఉన్న ప్రేమను చెప్పాలంటే పదాలు సరిపోవు.. నీకు ఎప్పుడూ మంచే జరిగాలి.. త్వరగా రా.. నిన్ను చూడాలని ఎంతో ఆత్రుతగా ఉన్నానంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

    English summary
    rashi khanna About her brother birthday..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X