ఆ పాత్రను ఒప్పుకుని చాలా పొరపాటు చేశా.. నా ఆశ నిరాశైంది.. యాంకర్ రష్మీ కామెంట్స్

బుల్లితెరపై గ్లామర్‌ను అద్దిన అతి కొద్ది మంది యాంకర్లలో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. అందచెందాలతో యాంకరింగ్‌లో కొత్త ఒరవడిని సృష్టించడం మొదలుపెట్టారు బుల్లితెర భామలు. గత ఏడేళ్లుగా రష్మీ.. తన మ్యాజిక్‌ను చూపిస్తూ ఎవర్‌గ్రీన్‌గా అలా రాణిస్తూనే ఉంటోంది. రష్మీ-సుధీర్ జంట కెమిస్ట్రీకి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. అయితే బుల్లితెరపై ఊపిరి సలపనంత బిజీగా ఉన్న రష్మీ.. వెండితెరపై ఆ స్థాయిలో రాణించలేకపోయింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

బుల్లితెరపై అమితమైన క్రేజ్..

బుల్లితెరపై అమితమైన క్రేజ్..

బుల్లితెరపై అప్పటికే సుమ, అనసూయ లాంటి వాళ్లు యాంకర్స్‌గా ఏలేస్తున్న తరుణంలో జబర్దస్త్ స్టేజ్‌పై మెరిసింది రష్మీ. అయితే మొదట్లో తెలుగు ఉచ్ఛారణలో తడబడినా.. మెల్లిమెల్లిగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అనసూయకు పోటీగా నిలబడింది. జబర్దస్త్, ఢీ, స్పెషల్ ఈవెంట్స్‌తో ఫుల్ పీక్స్‌లో ఉన్న రష్మీ..వెండితెరపై దృష్టి సారించింది.

ఒకే రకమైన పాత్రలు..

ఒకే రకమైన పాత్రలు..

అయితే రష్మీ మొదట వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. ఎవ్వరూ గుర్తుపట్టనటు వంటి క్యారెక్టర్స్ చేసిన రష్మీ.. జబర్దస్త్‌లో ఓ వెలుగు వెలిగే సరికే అందరి నోళ్లలో నానింది. ఎక్కడ చూసిన రష్మీ పేరే, రష్మీ సుధీర్ జంట గురించే టాపిక్ నడిచేది. అంతలా పాపులర్ అయిన రష్మీ.. వెండితెరపై మాత్రం తుస్సుమనిపించింది. అదే విషయమై తాజాగా మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించింది.

అలా కనిపించేసరికి అంతా షాక్..

అలా కనిపించేసరికి అంతా షాక్..

రష్మీ మాట్లాడుతూ.. ‘బుల్లితెరపై నాకున్న క్రేజ్ వెండితెరపై అవకాశాలను తెచ్చిపెట్టింది. దాంతో ఒక్కో సినిమా చేస్తూ వెళ్లాను. ఈ క్రమంలోనే 'గుంటూరు టాకీస్' సినిమా చేశాను. ఆ సినిమాలో నేను సెక్సీగా .. గ్లామర్ డోస్ పెంచేస్తూ కనిపించడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఆ సినిమా తరువాత నుంచి నాకు అదే తరహా పాత్రలు రావడం మొదలుపెట్టాయి.

Recommended Video

Case Filed Against Anchor Srimukhi | Filmibeat Telugu
ఆ పాత్రను ఒప్పుకుని తప్పు చేశా..

ఆ పాత్రను ఒప్పుకుని తప్పు చేశా..


దాంతో ఒకే కేటగిరికి సంబంధించిన పాత్రలను చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వైవిధ్యభరితమైన పాత్రలను చేయాలనే నా ఆశ నిరాశ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పాత్రను ఒప్పుకుని చాలా పొరపాటు చేశాననే చెప్పాలి. ఇకపై అలాంటి పాత్రలను ఎలాంటి పరిస్థితుల్లోను ఒప్పుకోన'ని తెగేసి చెప్పింది. మరి విలక్షణ పాత్రలు చేయాలన్న రష్మీ కోరిక నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X