రష్మీ గౌతమ్ ప్రేమ.. బిస్కెట్లు వేయండి అంతేగానీ.. ఆకట్టుకున్న జబర్దస్త్ బ్యూటీ
బుల్లితెర యాంకర్‌గా జబర్దస్త్ పాపులారిటీ సంపాదించింది రష్మీ గౌతమ్. వెండితెరపై కూడా తన అందాలతో కుర్రకారును మాయ చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్. విషయం ఏదైనా తాను చెప్పాలనుకుంటే కుండబద్దలు కొట్టేయడం ఆమె నైజం. ముఖ్యంగా సామాజిక అంశాలు, ముగా జీవాల గురించి రష్మీ ఎప్పుడూ స్పందిస్తుండటం గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే శునకాలపై తన ప్రేమను చాటుకుంటూ ఓ సందేశమిచ్చింది రష్మీ. వివరాల్లోకి పోతే..

రష్మీ గౌతమ్ ప్రేమ
ఈ సృష్టిలోని మూగ జీవాలంటే రష్మికి చాలా చాలా ఇష్టం. జంతు ప్రేమికులరాలిగా జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వెల్లడించింది ఈ జబర్దస్త్ బ్యూటీ. అంతేకాదు మూగ జీవాలన్నాక చిన్న, పెద్ద తేడా లేదంటూ సృష్టి లోని జీవాలన్నింటినీ కాపాడుకోవాలని ఆమె పలుసార్లు సోషల్ మీడియా సందేశం ఇచ్చింది.

అందరినీ మెప్పించే మెసేజ్
గతంలో ఓ సారి.. సృష్టి లోని ఈగలను కాపాడుకోవాలని తెలుపుతూ, వాటి కోసం ఓ స్పూన్‌లో కొంచెం పంచదార, లేదంటే తీపి పదార్థాలను ఉచాలని సూచించింది. ఈ సృష్టి లోని జీవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అని అప్పుడు రష్మి పేర్కొంది. అదేవిధంగా ఆవుల వదను ఖండిస్తూ అందరినీ మెప్పించే సందేశమిచ్చింది.

బిస్కెట్లు వేయండి అంతేగానీ..
ఈ బాటలోనే ఇప్పుడు శునకాల గురించి మాట్లాడింది రష్మీ. రోడ్డుపై వెళ్లేటప్పుడు మనకు చాలా కుక్కలు చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో అవి అరుస్తాయి, కరిచేందుకు కూడా వస్తాయి. అలాంటి కుక్కలపై రాళ్లు వేస్తే అది బుద్ధితక్కువ పనే అవుతుంది అని రష్మీ గౌతమ్ పేర్కొంది. ఆ కుక్కలపై అలా రాళ్లు వేయకుండా, వాటికి బిస్కెట్లు వేస్తే అవి ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. ఒక్కోసారి తమ ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యకుండా మనల్ని కాపాడతాయి అని రష్మీ తెలిపింది.

అసలు తెలివైన వాళ్లంటే..
కుక్కలకు బిస్కెట్లు వేసి, వాటితో స్నేహం చేసేవారు తెలివైన వారని రష్మీ మెసేజ్ ఇచ్చింది. ఇక రష్మీ తన ఇంట్లో కూడా ఓ కుక్కపిల్లని పెంచుకుంటోంది. దాని పేరు బంబుల్. అదంటే ఎంతో రష్మీకి ప్రాణం. దానితో ఫోటోలు దిగి ఎప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

నెటిజన్లు ఫిదా.. రష్మీకి సపోర్ట్
ఇలా జంతు ప్రేమ కురిపిస్తూ రష్మీ చేస్తున్న ఈ ట్వీట్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మూగ జీవాల పట్ల ఆమెకున్న ప్రేమ అభినందనీయం అని పేర్కొంటూ తాము కూడా జంతు సంరక్షణలో భాగం అవుతామని అంటున్నారు. రష్మీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.

రష్మి కెరీర్ ఎలా ఉందంటే..
బుల్లితెర యాంకర్‌గా పాపులర్ అయిన రష్మి.. ఆ తర్వాత వెండితెరపై కూడా కాలు మోపింది. కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ పోషించినప్పటికీ సరైన గుర్తింపు సంపాదించలేకపోయింది. అయినా వెనుకంజ వేయకుండా మంచి కథ దొరికితే ఎలాంటి రోల్ చేయడానికైనా సిద్దమేనని ఆమె అంటోంది.


Click it and Unblock the Notifications











