అందరూ అదే అడుగుతున్నారు.. అయినా నేనెందుకు ఆ పని చేస్తా? యాంకర్ రష్మీ ఫైర్

బుల్లితెర, వెండితెరతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది యాంకర్ రష్మీ. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన సమారాచాలు అందిస్తూ తన హాట్ హాట్ పిక్స్‌తో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆన్‌లైన్ వేదికలపై ఆమెకు ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. కాగా ఇదే సోషల్ మీడియా కారణంగా తాజాగా జరిగిన ఓ ఇష్యూపై స్పందిస్తూ ఫైర్ అయింది రష్మీ. ఇంతకీ ఏంటా ఇష్యూ? వివరాల్లోకి పోతే..

రష్మీ గౌతమ్ ప్రేమ.. జబర్దస్త్ బ్యూటీ సందేశాలు

రష్మీ గౌతమ్ ప్రేమ.. జబర్దస్త్ బ్యూటీ సందేశాలు

ఈ సృష్టిలోని మూగ జీవాలంటే రష్మికి చాలా ఇష్టం. జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వెల్లడించింది ఈ జబర్దస్త్ బ్యూటీ. అంతేకాదు మూగ జీవాలన్నాక చిన్న, పెద్ద తేడా లేదంటూ సృష్టి లోని జీవాలన్నింటినీ కాపాడుకోవాలని ఆమె పలుసార్లు సోషల్ మీడియా సందేశం ఇచ్చింది. జంతు ప్రేమికురాలిగా ఎప్పటికప్పుడు ట్వీట్స్ చేస్తూ వస్తోంది.

ఫోన్ నెంబర్‌ పోస్ట్ చేసిన రష్మీ..

ఈ నేపథ్యంలోనే కుక్కపిల్లలను ఎవరైనా దత్తత తీసుకుంటారని ఆశిస్తూ ఇటీవల ఓ ట్వీట్ చేసింది రష్మీ. చావు అంచుల దాకా వెళ్లొచ్చి ప్రాణాలతో బయటపడిన కుక్కపిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు ఈ నెంబర్‌కు సంప్రదించండి అంటూ కుక్క పిల్లల ఫొటోలతో పాటు ఫోన్ నెంబర్‌ను కూడా పోస్ట్ చేసింది రష్మీ.

ఉద్దేశం మారింది.. రష్మీ ఆగ్రహం

ఉద్దేశం మారింది.. రష్మీ ఆగ్రహం

గాయపడిన ఆ రెండు కుక్క పిల్లలను ఖైరతాబాద్‌కు చెందిన ధ్రువ్ ఆదిత్య అనే సోషల్ వర్కర్ కాపాడాడని, వాటిని ఎవరైనా దత్తత తీసుకోవాలని అనుకుంటే వెంటనే సంప్రదించండి అని రష్మీ తెలిపింది. మూగ జీవాలను ఆదుకోవాలనే కోణంలో ఈ ట్వీట్ చేసింది. కానీ నెటిజన్స్ మాత్రం మరోలా రియాక్ట్ అవడంతో రష్మీ ఆగ్రహానికి గురైంది.

అదే అడుగుతున్నారు.. విసిగిపోయి చెప్పేశాడు

అదే అడుగుతున్నారు.. విసిగిపోయి చెప్పేశాడు

తాను చేసిన ట్వీట్ చూసి.. సదరు సోషల్ వర్కర్ ధ్రువ్‌కి ఎందరో కాల్స్ చేశారని, అయితే వారంతా ఆ కుక్కపిల్లల గురించి అడగడం మానేసి రష్మీ ఎక్కడ? రష్మీతో మాట్లాడాలి అని అడుగుతున్నారని చెబుతూ ఘాటుగా స్పందించింది ఈ జబర్దస్త్ బ్యూటీ. అదంతా వినీ వినీ ధ్రువ్ విసిగిపోయి తనకు కాల్ చేసి ఆ విషయం చెప్పాడని రష్మీ తెలిపింది. ఈ మేరకు నెటిజన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది రష్మీ.

కామన్ సెన్స్‌తో ఆలోచించండి.. నేనెందుకు అలా చేస్తా

కామన్ సెన్స్‌తో ఆలోచించండి.. నేనెందుకు అలా చేస్తా

''ఇటీవల రెండు కుక్క పిల్లలను ఎవరైనా దత్తత తీసుకుంటారేమోనని ఫోన్ నెంబర్ ట్వీట్ చేస్తే.. ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి కానీ వారంతా తనతో మాట్లాడేందుకే కాల్ చేశారు తప్ప కుక్క పిల్లల గురించి ఆరా దీయలేదు. అందులో తప్పు లేదు. సెలబ్రిటీలతో మాట్లాడాలని అందరికీ ఉంటుంది. కానీ కాస్త కామన్ సెన్స్‌తో ఆలోచించండి. నేను అతని నెంబర్ ఇస్తాను.. కానీ నా నెంబర్ ఎందుకిస్తా? నా సంగతి పోనీ.. మీరైనా పబ్లిక్‌గా మీ నెంబర్‌ను అందరికీ ఇచ్చేస్తారా?'' అని ఘాటుగా ప్రశ్నించింది రష్మీ.

Recommended Video

Rashmi Gautam Supports Sreemukhi || శ్రీముఖి కి రష్మీ సపోర్ట్ !
మహా పాపం అంటూ రష్మీ ఫైర్..

మహా పాపం అంటూ రష్మీ ఫైర్..

ఎవరో ఆ కుక్క పిల్లలను గాయపరిస్తే ధ్రువ్ వాటిని కాపాడి తన వద్ద ఉంచుకున్నాడు. వాటిని ఎవరైనా దత్తత తీసుకుంటారేమోనని, అతని నెంబర్ ట్వీట్ చేశా. కానీ మీరేమో అతనికి ఫోన్ చేసి నాతో మాట్లాడాలని చెప్పడం కరెక్ట్ కాదు. సాయం చేయకపోయినా ఫర్వాలేదు. కానీ రిటర్న్‌గా ఏమీ ఆశించకుండా మూగజీవులకు సాయం చేస్తున్న ఇలాంటివారిని మాత్రం కష్టపెట్టకండి. అది మహా పాపం అంటూ ఫైర్ అయింది రష్మీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X