యాంకర్ రష్మీ ఇంట కొలువుదీరిన గణనాథుడు.. ఫొటోస్ షేర్ చేస్తూ!

దేశ వ్యాప్తంగా వినాయక చవితి అంటే ఆ క్రేజే వేరు. ఎంతో ప్రత్యేకమైన ఈ పండుగను ఊరూరా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వినాయకుడిని ఆది దేవుడు అంటారు. ఏ పని మొదలెట్టాలన్నా ముందుగా ఆయన పూజనే చేయడం ఆనవాయితీ. అలాంటి గణపతి పప్పను ప్రతీ ఏడాది వినాయక చవితి నాడు ప్రతిష్టించి గొప్పగా పూజలు చేస్తారు. వాడవాడనా గణేషుడిని ప్రతిష్టిస్తారు.

ఇక సాధారణ జనం మొదలుకొని సెలెబ్రిటీల వరకు అందరి ఇంట్లోనూ గణనాథుడు కొలువుదీరి పూజలందుకుంటాడు. ఈ కోవలోనే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సినీ సెలెబ్రిటీలంతా ఆ గణనాథుడి సేవలో నిమగ్నమైపోతారు. ఇంటింటా గణేశుడి విగ్రహాన్ని పెట్టుకొని పండగ చేసుకుంటారు. ఇదే బాటలో జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా వినాయకుడి సేవలో మునిగి పోయింది.

Rashmi Gautam tweet on Ganesh Chaturthi special

తన ఇంట్లో గణనాథుడిని ప్రతిష్ఠించుకొని గొప్పగా అలంకరించింది. వినాయక చవితి సందర్బంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తాను పూజ చేసిన వినాయకుడి ఫోటోలను, పూజా విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నెట్టింట రష్మీకి భారీ ఫాలోయింగ్ ఉండటంతో ఈ ఫోటోలు వెంటనే వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ చూసి మురిసిపోతున్న రష్మీ అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక రష్మీ కెరీర్ విషయానికొస్తే.. బుల్లితెరపై ఓ రేంజ్‌లో రాణిస్తున్న ఈమె వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. దీంతో ఈ అమ్మడు వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X