అడవిలో ఆపసోపాలు.. కాలిబాటన రష్మిక మందాన్న.. వీడియో వైరల్

రష్మిక మందాన్న ప్రస్తుతం న్యూ ఇయర్ పార్టీ మూడ్‌లోనే ఉంది. ఇంకా గోవాలోనే తన స్నేహితులతో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం రష్మిక సినిమా ప్రపంచానికి దూరంగా సహజత్వానికి దగ్గరగా బతుకుతోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి రష్మిక న్యూ ఇయర్ పార్టీలో రచ్చ చేసింది. గోవాలో ఐదారు రోజుల ముందే మకాం వేసింది. ఇంకా అక్కడే ఉంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. రష్మిక తన ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో కలిసి అడవుల్లో పడి కాలిబాటను కొనసాగిస్తున్నారు.

న్యూ ఇయర్ పార్టీ..

న్యూ ఇయర్ పార్టీ..

నూతన సంవత్సరాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు రష్మిక తన గ్యాంగ్‌తో కలిసి గోవాలో మకాం వేసింది. అక్కడ తన స్నేహితులతో కలిసి రచ్చ చేస్తున్నా వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూనే వస్తోంది.

లైవ్‌లో దర్శనం..

లైవ్‌లో దర్శనం..

న్యూ ఇయర్ కంటే ఒక్క రోజు ముందు రష్మిక లైవ్‌లోకి వచ్చింది. తాను ఎక్కడున్నది.. ఎవరితో ఉన్నది అనే విషయాలను చెప్పేసింది. న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటున్నానని చెప్పింది. అలాగే తన సినిమా ప్రాజెక్ట్‌ల గురించి కూడా చెప్పేసింది. తమిళంలో మరో ప్రాజెక్ట్ రెడీ అవుతోందని క్లారిటీ ఇచ్చింది.

అభిమానులపై ప్రేమ..

అభిమానులపై ప్రేమ..

రష్మిక తన అభిమానులపై ప్రేమను కురిపించింది.. లైవ్‌లోనే ముద్దుల వర్షాన్ని కురిపించింది. తన అభిమానులకు కేవలం ఐ లవ్యూ అని చెప్పగలను వారంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అభిమానుల కోసం లైవ్‌లోనే ప్రేమ చిహ్నాన్ని చూపిస్తూ వెరైటీ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టేసింది.

అడవిలో అందరూ..

అడవిలో అందరూ..

ఇక తాజాగా రష్మిక అడవిలో సేదతీరుతోన్న వీడియోను షేర్ చేసింది. తన ఫ్రెండ్స్ అందరూ అలా కూర్చుని ఉండటం, బట్టలు ఆరేసుకుని ఉండటం వంటి వాటిని చూపించింది. మొత్తానికి రష్మిక ఇప్పుడు అడ్వెంచర చేయడానికి బయల్దేరింది.

ట్రెక్కింగ్ అంటూ..

ట్రెక్కింగ్ అంటూ..

రష్మిక ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి అడవిలో ఆపసోపాలు పడుతోంది. ఈ వీడియోలో రష్మిక ముందుంది.. వెనకలా నుంచి ఆమె స్నేహితుడు ఈ వీడియోను తీస్తున్నట్టున్నాడు. అదే సమయంలో ఎవరో కిందపడిపోయినట్టు కూడా శబ్దం వినిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X