Rashmika Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక.. అలా బయటపడ్డ మేటర్.. పిక్స్ వైరల్

ప్రతి సినీ ఇండస్ట్రీలోనూ హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాకుల గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటుల మధ్య వ్యవహారాలు సైతం హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్యన కూడా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరూ కలిసి దీపావళి పండుగ జరుపుకున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

అలా వచ్చి స్టార్లుగా మారారు:'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ మూవీతో రష్మిక మందన్నా హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. అలాగే, విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా ఎంటరయ్యాడు. అతడు కూడా కొన్ని సినిమాలే చేసి స్టార్‌గా ఎదిగాడు. దీంతో ఇద్దరూ సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్లుగా సత్తా చాటుతోన్నారు.

Rashmika Mandanna Celebrates Diwali at Vijay Devarakonda House

రష్మిక అలా... విజయ్‌ ఇలా:రష్మిక మందన్నా ఇప్పుడు దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ సందడి చేస్తోంది. ఇప్పుడామె 'పుష్ప 2'తో పాటు బాలీవుడ్ చిత్రాలు 'యానిమల్' చిత్రాల్లో నటిస్తోంది. ఇక, విజయ్ దేవరకొండ ఇటీవలే 'ఖుషి' అనే సినిమాతో వచ్చాడు. కానీ, ఇది కూడా అతడిని నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

విజయ్‌తో రష్మిక డేటింగ్‌లో:సినిమా కెరీర్‌ను మొదలు పెట్టిన తొలినాళ్లలోనే రష్మిక మందన్నా కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఆ వెంటనే అతడితో ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. కానీ, అర్థాంతరంగా అతడితో బంధానికి బ్రేకప్ చెప్పేసింది. ఇక, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Rashmika Mandanna Celebrates Diwali at Vijay Devarakonda House

విజయ్, రష్మిక పెళ్లి అంటూ:రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాలను చేశారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ చిన్నది తరచూ విజయ్ ఇంట్లో కనిపిస్తోంది. అలాగే, తరచూ వీళ్లు పర్సనల్ టూర్లకు కూడా వెళ్తున్నారు. దీంతో వీళ్ల పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తూనే ఉంది.

దీపావళి పిక్స్ రావడంతోనే:దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో పండుగను గ్రాండ్‌గా జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే రష్మిక మందన్నా కూడా దీపావళి పండుగ ఫొటోలను షేర్ చేసింది. అంతేకాదు, అటు విజయ్, ఇటు రష్మిక ఇద్దరూ ఒకే క్యాప్షన్‌ పెట్టి ఫ్యాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Rashmika Mandanna Celebrates Diwali at Vijay Devarakonda House

విజయ్ ఇంట్లోనే రష్మిక:విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా షేర్ చేసిన ఫొటోల్లో కొన్ని కామన్ అంశాలు కనిపించాయి. దీంతో వీళ్లిద్దరూ ఒకే చోట దీపావళి పండుగను జరుపుకున్నారన్న మేటర్ బయటకు వచ్చింది. చాలా మంది నెటిజన్లు ఈ ఫొటోల్లోని కామన్ పాయింట్లను గుర్తిస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు టాలీవుడ్‌లోనూ హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X