For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీచ్‌లో మొదటి సారి అలాంటి పనులు.. దేవుడా అంటూ సంబరపడుతున్న రష్మిక

    |

    శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసింది. తెరపై రష్మిక చేసే అల్లరి ఎంతలా ఉంటుందో.. అంతకు పదింతలు బయట చేస్తుంది. రష్మికకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో అంతే నెగెటివిటీ కూడా వస్తుంది. కొందరు ఆమె చేసే అల్లరిని ఇష్టపడుతారు.. ఇంకొందరు దాన్ని అతి అంటూ విసుక్కుంటారు. ఏది ఏమైనా రష్మిక మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది.

    వరుస హిట్లు..

    వరుస హిట్లు..

    ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది రష్మిక మందాన్న. మొదటి చిత్రమే ఓ రేంజ్‌లో హిట్టవ్వడంతో లక్కు బాగానే కలిసి వచ్చింది. ఆపై గీతగోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో దూసుకెళ్తోంది. రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోలకు మంచి చాయిస్‌గా మారుతోంది.

    చిట్ చాట్స్..

    చిట్ చాట్స్..

    రీసెంట్‌గా రష్మిక తన ఫ్యాన్స్‌కు ఓ క్విజ్ పోటీ కూడా పెట్టింది. తనకు ఇష్టమైన వాటిని ఆప్షన్స్‌గా పెట్టి.. అందులో ఎంత మందికి తన అభిప్రాయాలే ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఎన్నో విషయాలను బయటపెట్టింది. తనను అందరూ సింగిలేనా? అని అడుగుతుంటారని, అవును సింగిలే. అలా ఉంటేనే ఎంతో సంతోషంగా ఉంటాను.. అలా ఉండి చూడండి.. మీకు అదే అనిపిస్తుందని ఫ్యాన్స్‌కు సూచనలు కూడా ఇచ్చింది.

    వెరైటీ ఫోటో షూట్లు..

    వెరైటీ ఫోటో షూట్లు..

    భీష్మ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్ చెప్పిన ఓ సీక్రెట్‌తో రష్మిక పరుపుపోయింది. రష్మిక కుక్క బిస్కెట్స్ తింటుందని చెప్పడంతో ఆ విషయం తెగ వైరల్ అయింది. ఇక ఆ తరువాత చేసిన ఫోటో షూట్లు కూడా బుజ్జికుక్క పిల్లలా పోజులు పెట్టడంతో అందరూ తెగ ట్రోల్స్ చేశారు.

    వర్కౌట్లతో బిజీగా..

    వర్కౌట్లతో బిజీగా..

    రష్మిక ప్రస్తుతం వర్కౌట్లతో తెగ బిజీగా ఉంది. ఎన్నడూ లేనంతగా విపరీతంగా కష్టపడుతుంది. ఏమైనా లావుగా ఉందా అంటే అది లేదు. కానీ వర్కౌట్లు మాత్రం ఇరగదీసేస్తోంది. ఇసుకలో పరిగెత్తుతూ, వర్కౌట్లు చేస్తూ నానా రచ్చ చేస్తోంది. ఈ మేరకు ఓ వీడియోను కూడా షేర్ చేసింది.

    Green India Challenge : Tollywood Celebrities Actively Participating Green India Challenge
    దేవుడా.. బానిసవ్వాల్సిందే..

    దేవుడా.. బానిసవ్వాల్సిందే..

    బీచ్‌లో ఇదే నా ఫస్ట్ వర్కౌట్. మామూలుగా అయితే బీచ్‌లో ఇలా చేయడం ఇదే మొదటిసారి.. అమ్మో అక్కడ వర్కౌట్లు అంటే మొత్తం ఆవిరైపోయినట్టు అనిపించింది.. ఆ అలలు, సముద్రపు వాసన.. దేవుడా.. ఇవన్నీ అనుభవించాక వాటికి నేను బానిసనైపోయాను.. సూర్యాస్థమయం, నా పాదాలకంటున్న ఇసుక అవన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి అంటూ తెగ సంబరపడిపోయింది. ఈ వర్కౌట్లన్నీ పుష్ప సినిమా కోసమో ఏమో మరి.

    English summary
    Rashmika Mandanna First Time Workout In Beach, This is actually one of the very first times I’ve worked out on the beach and let me tell you it was exhausting but omg can get so addictive.. the sound of the waves ..the smell of the ocean .. and watching the sunset .. the sand against my feet.. it was beautiful..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X