న్యూ ఇయర్ స్పెషల్.. ఇప్పుడే మత్తు వదిలినట్టుందిగా.. పార్టీ మూడ్‌లో రష్మిక!!

రష్మిక మందాన్న ప్రస్తుతం గోవాలో న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటోంది. తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి రచ్చ రచ్చ చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా అక్కడే సందడి చేస్తోన్న రష్మిక నిన్న రాత్రి నూతన సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేసినట్టుంది. రాత్రి న్యూ ఇయర్ విషెస్ చెప్పి బాగా పార్టీ చేసుకుని పడుకున్నట్టుంది. మొత్తానికి మధ్యాహ్నం ఎప్పుడో నిద్ర లేచినట్టుగా ఉంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఫోటో తెగ వైరల్అవుతోంది.

గోవాలో రచ్చ...

గోవాలో రచ్చ...

న్యూ ఇయర్ పార్టీకి అందరూ గోవాకు మకాం మార్చేశారు. హీరో హీరోయిన్లు ఎక్కువగా ఇప్పుడు గోవాలోనే నూతన సంవత్సర వేడుకలను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అలా రష్మిక కూడా తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడే న్యూ ఇయర్‌ను సెలెబ్రేట్ చేసుకుంది.

 లైవ్‌లోకి వచ్చి..

లైవ్‌లోకి వచ్చి..

అక్కడే గోవాలో ఉన్న రష్మిక సడెన్‌గా సర్ ప్రైజ్ ఇచ్చింది. లైవ్‌లోకి వచ్చి గోవా విశేషాలను చెప్పేసింది. అయితే నెటిజన్లు మాత్రం వింత వింత ప్రశ్నలు అడిగారు. కోలీవుడ్ ప్రాజెక్ట్‌ల గురించి, గోవాకు ఎవరితో వెళ్లావ్ అంటూ రకరకాలుగా ప్రశ్నించారు.

మీ ప్రాబ్లం ఏంటి..

మీ ప్రాబ్లం ఏంటి..

గోవాలో ఫ్రెండ్స్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నావా? అని ఇంకొందరు.. గోవాలో మీ ఫ్రెండ్స్‌తో ఫన్ ఉందా అంటూ రకరకాల ప్రశ్నలు అడుగుతుండటంతో మీకేమైంది.. ప్రాబ్లం ఏంటి.. ఇక్కడ ఫన్, ఎంజాయ్ చేస్తున్నానంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

అందరి కోసం..

అందరి కోసం..

రష్మిక తన అభిమానుల కోసం లైవ్‌లోనే ఓ స్పెషల్ పోజ్ పెట్టేసింది. అందరూ లవ్ సింబల్స్ పంపిస్తున్నారంటూ తాను కూడా లవ్ సింబల్‌ను పెట్టేసింది. లైవ్‌ను ముగించే సమయంలోనూ అందరి కోసం ఐ లవ్యూ చెప్పేసింది. చివరకు లైవ్ ఎలా ఆఫ్ చేయాలో తెలియకు కాస్త తికమకపడింది.

గుడ్ మార్నింగ్ అంటూ..

గుడ్ మార్నింగ్ అంటూ..

అయితే రష్మిక మధ్యాహ్నం మూడు గంటలకు లేచినట్టుంది. లేచిన వెంటనే ఓ పోస్ట్ పెడుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పేసింది. మత్తు వదిలినట్టుగా చెబుతూ ఓ జిఫ్ ఫైల్‌ను కూడా షేర్ చేసింది. మొత్తానికి రాత్రి మాత్రం బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X