twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిట్టి చెల్లితో రష్మీక సందడి.. క్యూట్ పిక్ వైరల్

    |

    కన్నడ సుందరి రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ గురించి, సినిమా అప్డేట్స్ గురించి ఇలా ప్రతీ ఒక్క విషయం గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెర వెనుక కూడా అంతే చలాకిగా ఉంటుంది. ఆ మధ్య తన తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్పిందో మనమంతా చూశాం. తండ్రీకూతుళ్ల బంధం, తన తండ్రి అంటే ఎంత ఇష్టమో చెప్పి అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేసింది.

    రష్మికకు ఓ బుల్లి సోదరి ఉన్న సంగతి తెలిసిందే. తనను రష్మిక ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. లాక్‌డైన్ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు చిట్టి చెల్లెలితో సరదాగా ఆటలు ఆడింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కూడా అయ్యాయి. ఇక రీసెంట్‌గా తన ఫ్యాన్స్‌కు ఓ క్విజ్ పోటీ కూడా పెట్టింది. తనకు ఇష్టమైన వాటిని ఆప్షన్స్‌గా ఎంత మంది తనలాగే ఇష్టపడుతున్నారో తెలుకుంది. ఈ క్రమంలో ఎన్నో విషయాలను బయటపెట్టింది.

    Rashmika Mandanna With Her Little Sister

    తనను అందరూ సింగిలేనా? అని అడుగుతుంటారని, అవును సింగిలే. అలా ఉంటేనే ఎంతో సంతోషంగా ఉంటాను.. అలా ఉండి చూడండి.. మీకు అదే అనిపిస్తుందని ఫ్యాన్స్‌కు సూచనలు కూడా ఇచ్చింది. ఇక తాజాగా తన చిట్టి చెల్లితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది రష్మిక. ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మందాన్నసిస్టర్స్ ఎంతో క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాకు ఓకే చెప్పింది.

    English summary
    Rashmika Mandanna With Her Little Sister. She Posted A Pic With Her Baby Sister WIth the Caption Love
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X