డబ్బులు లేక అలాంటి పరిస్థితి.. కన్నీళ్లు పెట్టించే రష్మిక కథ తెలుసా?
స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో అంతకంతకు ఎదుగుతూనే ఉంది. చిన్న హీరోల సరసన మొదలైన ఈ బ్యూటీ కెరీయర్ ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ హీరోలతో నటించే స్థాయికి చేరుకుంది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుంటూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారుతోంది. రీసెంట్ 'ఛావా' చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూశాం.
అయితే రష్మిక మందన్న ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటుంది. తన గురించిన అప్డేట్స్ ను, వ్యక్తిగత విషయాలను కూడా ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తోంది. ఈరోజు రష్మిక మందన్న పుట్టిన రోజు కావడం విశేషం. నేటితో 29వ ఏట నేషనల్ క్రష్ అడుగుపెట్టింది. దీంతో ఆమెకు అభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రష్మికకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.

కాగా, రష్మిక మందన్న గురించి ఓ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకింగ్ గా మారింది. ఇప్పుడంటే రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ గా చలామణీ అవుతూ కోట్లట్లో రెమ్యునరేషణ్ తీసుకుంటుంది, కానీ గతంలో మాత్రం ఆమె ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నే తమ కుటుంబం డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులు పడిందో చెప్పుకొచ్చింది. ఆ కథ వింటే రష్మిక మందన్న అభిమానులకే కాదు నార్మల్ ఆడియెన్స్ కు కూడా కన్నీళ్లు రావాల్సిందే.
రష్మిక మందన్న చిన్న తనంలో తన తండ్రి ఎంతో కష్టపడేవారి తెలిపింది. తమకు బిజినెస్ లు లేని రోజుల్లో అద్దె ఇంట్లో ఉండేవారని, అయితే అప్పట్లో ఆర్థిక పరిస్థితులు మరీ దారుణంగా ఉండేవని, ఒక సందర్భంలో రెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పింది. ఇప్పుడు స్టార్ హోదాలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నప్పటికీ చిన్నప్పుడు తనకు ఆడుకోవడానికి బొమ్మలు కూడా కొనివ్వలేని పరిస్థితిని తన తల్లిదండ్రులు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చింది. అందుకే తను డబ్బు పట్ల ఎంతో గౌరవంగా ఉంటానని తెలిపింది.
రష్మిక మందన్న కూడా చిన్నప్పుడే కష్టాలను దాటుకొని ఈ స్థాయికి చేరుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జీవిత కష్టాలను దాటొచ్చింది కాబట్టే.. రష్మిక మందన్న తన సినిమాల విషయాల్లో ఎంతటి హార్డ్ వర్క్ నైనా చేసేందుకు ఇష్టపడుతూ ఉంటుంది. ఇక మూడు పదుల వయస్సు రాకుండానే ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఎదగడమంటే మాములు విషయం కాదు. కోట్లల్లో ఒక్కరికో ఇద్దరికో దక్కే అదృష్టం అది. కన్నడ చిత్రాల నుంచి మొదలై ప్రస్తుతం నార్త్, సౌత్ ను ఏలడమంటే మాటల్లో చెప్పినంత ఈజీ టాస్క్ కాదని సినీ ప్రముఖులు కూడా అంటున్నారు. ఇక రష్మిక మందన్న రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సరసన 'సికందర్' చిత్రంలో నటించి హిట్ అందుకుంది. నెక్ట్స్ 'కుబేరా', 'ది గర్ల్ ఫ్రెండ్', 'తామా' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











