Rashmika Vijay Deverakonda's Wedding Live: దంపతులైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఏడేళ్ల డేటింగ్‌కు తెర

ఇండియన్ టాప్ స్టార్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వివాహం అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్నది. దేవరకొండ, మందన్న కుటుంబాలు, అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో పాలుపంచుకొంటున్నారు. ఫిబ్రవరి 24, 25 తేదీలలో హల్దీ, మెహందీ, సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి 26వ తేదీన కల్యాణం జరుగుతుంది. దాంతో వారిద్దరూ జీవిత భాగస్వాములుగా మారిపోతారు. ఉదయ్‌పూర్‌లోని జరుగుతున్న ఈవెంట్‌కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ అప్ డేట్స్ మీ కోసం..

ఫిబ్రవరి 23వ తేదీన రష్మిక, విజయ్ ఉదయ్ పూర్‌కు చేరుకొన్నారు. అంతకు ముందే అక్కడ జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు. ఆ తర్వాత రోజు విజయ్ తండ్రి గోవర్దన్ దేవరకొండ దంపతులు, మందన్న ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి చేరుకొన్నారు.

Rashmika Vijay Deverakonda s Wedding Live Updates

LIVE Feed
  • Feb 26, 2026 11:54 AM

    కన్నడ సంప్రదాయం ప్రకారం

    కన్నడ సంప్రదాయం ప్రకారం విజయ్, రష్మిక మరోసారి ఇదే రోజు వివాహం చేసుకోనున్నారు. కన్నడలోని కొడవ సంప్రదాయం ప్రకారం రష్మికతో సాయంత్రం 4 గంటల సమయంలో విజయ్ కల్యాణం జరుగనున్నది.

  • Feb 26, 2026 11:52 AM

    ఒక్కటైన విజయ్, రష్మిక

    గత ఏడేళ్లుగా డేటింగ్ చేస్తున్న రష్మిక, విజయ్ దేవరకొండ దంపతులుగా మారారు. రష్మిక మెడలో వేద బ్రహ్మణులు నిర్ణయించిన ముహుర్తం ప్రకారం 10.10 నిమిషాలకు వివాహం చేసుకొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వారి వివాహం జరిగింది.

  • Feb 26, 2026 9:28 AM

    విజయ్ - రష్మిక పెళ్లి శుభ ముహూర్తం ఇదే

    టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) పెళ్లి వేడుకలు రాజస్థాన్ ఉదయపూర్‌లోని ITC మెమెంటోస్ (ఎకాయా ఉదయపూర్) హోటల్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 7:30 గంటలకు బరాత్ కార్యక్రమం ప్రారంభమైంది. తెలుగు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉదయం 10:10 ముహూర్తంలో మొదటి వివాహం జరుగుతుంది.

  • Feb 25, 2026 7:33 PM

    విరోష్ క్రికెట్ ప్రీమియర్ లీగ్

    రష్మిక, విజయ్ పెళ్లి సంబురాల సందర్భంగా ఆట విడుపుగా విరోష్ పేరుతో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. దానికి విరోష్ ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టారు. ఈ పోటీలో విజయ్, రష్మిక జట్లు పాల్గొన్నాయి. ఇరు కుటుంబాల సభ్యులు ఈ మ్యాచ్‌లో పాలు పంచుకొన్నారు అని తెలిసింది.

  • Feb 25, 2026 5:29 PM

    అనిల్ అంబానీ ఫ్యామిలీతో

    విజయ్, రష్మిక పెళ్లికి ముఖేష్ అంబానీ సోదరుడు, పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ, టీనా దంపతులు హాజరయ్యారు.

  • Feb 25, 2026 5:29 PM

    ముఖేష్ అంబానీ కుటుంబం

    విజయ్, రష్మిక వివాహానికి దేశంలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, ఆయన కూతురు ఇషా అంబానీ కూడా ఉదయ్‌పూర్‌కు చేరుకొన్నారు. వారికి ఇరు కుటుంబాల సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

  • Feb 25, 2026 5:29 PM

    సందీప్ రెడ్డి వంగా క్రేజీగా

    ఫిబ్రవరి 25వ తేదీన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఉదయ్‌పూర్‌కు చేరుకొన్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఈవెంట్ జరిగే వేదికకు ప్రయాణమై వెళ్తూ మీడియా కంట చిక్కారు.

  • Feb 25, 2026 5:28 PM

    తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా

    ఇక ఫిబ్రవరి 24వ తేదీన విజయ్, రష్మిక వివాహానికి పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఇషా రెబ్బా ఉదయ్‌పూర్‌కు చేరుకొన్నారు. ఎయిర్‌పోర్టులో మీడియాకు వారు కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X