అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బాలు.. వీడియో చూసి కన్నీరు పెట్టుకున్న రవీనా టండన్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) స్వర్గానికి వెళ్లిపోయారు. కోట్ల మంది అభిమానులను ఒంటరి చేసి నిన్న (సెప్టెంబర్ 25) మధ్యహ్నం ఒంటి గంటకు తుది శ్వాస విడిచారు. కరోనాతో పోరాడి గెలిచిన బాలు ఇతర సమస్యలు వెంటాడటంతో పోరాడి అలిసిపోయారు. ఎస్పీబీ లేరన్న వార్తతో ఎంతో మంది సంగీత ప్రియులు, సినీ సెలెబ్రిటీలు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇక ఎస్పీబీకి సంబంధించిన జ్ఞాపకాలు, బాలు చెప్పిన పాఠాలు, మాటలు, పాడిన పాటల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

సంతాపం ప్రకటించిన భారతావని..
ఎస్పీ బాలు మృతి పట్ల కేవలం సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు మాత్రమే సంతాపాన్ని ప్రకటించలేదు. భారత ప్రధాని మొదలుకొని ప్రతీ ఒక్కరూ బాలు మరణం పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక చైన్నైలోని ఆయన నివాసం వద్ద భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు.

ప్రభుత్తం లాంఛనాలతో..
అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఆయన ఇంటి వద్ద ఉంచారు. సాయంత్రం వేళ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో తామరైపాక్కం ఫాంహౌస్‌కు తరలించారు.ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియల సమయంలో తమిళనాడు పోలీసులు గౌరవం వందనం సమర్పించారు. గాల్లోకి తుపాకులు పేల్చి దిగ్గజ గాయకుడు ఎస్పీబాలుకు గౌరవం వందనం సమర్పించారు.
నాటి వీడియో..
శ్రీలంక బాంబు పేలుళ్లలో గాయపడిన కళ్లు పోగొట్టుకున్న ఓ అభిమానికి బాలు సర్ ప్రైజ్ ఇచ్చారు. అభిమాని దగ్గరికి వెళ్లి ఆయన పాట పాడుతూ.. దాంట్లో బాలు శృతి కలిపారు. ఇక ఏకంగా ఎస్పీ బాలుయే తన పాటకు వంత పాడటంతో సదరు అభిమాని ఆనందాన్ని పట్టలేకపోయాడు.

రవీనా టండన్ ఎమోషనల్..
ఇక ఆ వీడియోను, అందులో బాలు గారి మాట్లాడిన విధానానికి రవీనా టండన్ ఎమోషనల్ అయింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. నా కంట్లో నీళ్లు తిరిగాయి.. నా గొంతు మూగబోయింది.. అదే బాలు గారి గొప్పదనం అంటూ చేతులెత్తి దండం పెట్టేసింది. ఓం శాంతి అంటూ నమస్కరించింది.


Click it and Unblock the Notifications











