భూమిక చేసిన పనికి.. నా పరువు పోయింది.. ‘అనసూయ’ గురించి రవిబాబు షాకింగ్ విషయాలు
టాలీవుడ్‌లో హీరోగా, విలన్, కమెడియన్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా పలు పాత్రలను సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న వారిలో రవిబాబు ముందు వరుసలో ఉంటారు. ఎలాంటి ఫిల్టర్లు లేకుండా మనసులో ఉన్న విషయాలను ముక్కుసూటిగా చెప్పేస్తారు. తాజాగా ఓఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిబాబు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అదేమిటంటే...

నా కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే
నా కెరీర్‌లో నేను ఎప్పుడూ ఇబ్బంది పడిన సందర్భాలు లేవు. నేను ఏ విషయాన్ని ఇబ్బందిగా, సమస్యగా పరిగణించను. ఎలాంటి అంశాలు నా ముందుకు రాకుండా పక్కా ప్లానింగ్‌తో ఉంటాను. కానీ అనసూయ సినిమా షూటింగ్ సందర్భంగా భూమిక వల్ల చాలా ఇబ్బందికి గురయ్యాను అని రవిబాబు చెప్పారు.

గుండు చేసుకొని కనుబొమ్మలు షేవ్
భూమికపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాను. ఫ్రెంచ్ కట్ గెడ్డం, జుట్టుతో ఉన్న గెటప్‌ను క్లోజ్ చేసింది. కనుబొమ్మలు లేకుండా గుండుతో కనిపించే పాత్ర కోసం సిద్ధమయ్యాను. ఆ మేరకు గుండు చేసుకొని, కనుబొమ్మలు గీకించుకొన్నాను. అంతలోనే భూమిక తన ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో ఆ రోజుకు షూటింగ్ క్యాన్సిల్ చేశాం అని రవిబాబు చెప్పారు.

భూమిక అనారోగ్యానికి గురి కావడంతో
అయితే షూటింగ్ క్యాన్సిల్ అయిన మరుసటి రోజు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని అడిగాం. కానీ ఆమె షూటింగు రాలేని పరిస్థితి. ఆరోగ్యం ఇంకా కుదట పడలేదు. తాను ముంబైకి వెళ్లిపోతానని చెప్పారు. ఆ తర్వాత భూమిక 40 రోజులపాటు షూటింగ్‌కు రాలేదు అని రవిబాబు వెల్లడించారు.
చీరకట్టులో కియారా అద్వానీ అందాల ఆరబోత... లేటేస్ట్ ఫోటోలు వైరల్

భూమిక రాకపోవడంతో నానాకష్టాలు
ఇక భూమిక రాకపోవడంతో షూటింగ్ కంప్లీట్‌గా వాయిదా వేశాం. కానీ గుండు, కనుబొమ్మలు లేకుండా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో నేను టోపి పెట్టుకొని, కళ్లజోడు పెట్టుకొని తిరగాల్సి వచ్చింది. అదే నా కెరీర్‌లో పడిన ఇబ్బందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ముందు రోజు భూమిక ఆరోగ్యం బాగాలేదనే విషయం తెలిసి ఉంటే నాకు ఆ కష్టం వచ్చి ఉండేది కాదు అని రవిబాబు తెలిపారు.

అనసూయ మూవీ గురించి
ఇక అనసూయ విషయానికి వస్తే..2007లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఫ్లయింగ్ ఫ్రాగ్ బ్యానర్‌పై రూపొందించిన శేఖర్ చంద్ర సంగీతం అందించగా, సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫిని, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.


Click it and Unblock the Notifications











