రవితేజ అలా శ్రుతీ హాసన్ ఇలా.. గోవా బీచ్‌లో సందడి
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోవాలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ శ్రుతీ హాసన్‌తో కలిసి గోవాలో రచ్చ రచ్చ చేసేందుకు వెళ్లాడు. క్రాక్ టీం తన చివరి షెడ్యూల్‌లో భాగంగా గోవాకు చెక్కేసింది. అసలే కరోనా లాక్డౌన్ వల్ల సినిమా ఆలస్యమైంది. ఎప్పుడో సమ్మర్‌కు రావాల్సిన సినిమా ఇలా మొత్తానికి వచ్చే ఏడాదిలో రావాల్సి వస్తోంది. షూటింగ్ ఈ నెలలో పూర్తి కాబోతోంది. వరుసగా ఫ్లాపులతో ఉన్న రవితేజకు క్రాక్ ఉపశమనిచ్చేలానే కనిపిస్తోంది.
క్రాక్ పోస్టర్స్, టీజర్ సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేశాయో అందరికీ తెలిసిందే. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలుపెడదామా? సెట్‌లోకి అడుగు పెడదామా? అని రవితేజ రెడీగా ఉన్నాడు. హైద్రాబాద్ షెడ్యూల్‌ను చకచకా పూర్తి చేసిన క్రాక్ యూనిట్.. వెంటనే గోవాకు మకాం మార్చేసింది. శ్రుతీ హాసన్ రవితేజ కాంబోలో తీయాల్సిన సీన్స్, సాంగ్‌ను అక్కడ ప్లాన్ చేసింది.

ప్రస్తుతం రవితేజ, శ్రుతీహాసన్ గోవా బీచ్‌లో సందడి చేస్తున్నారు. శ్రుతీ హాసన్ ఏమో జంప్‌లు చేస్తూ బిజీగా ఉంటే.. రవితేజ మాత్రం షూటింగ్ ఎలా జరుగుతోంది ఓ వీడియోను తీసి షేర్ చేశాడు. ఈ రోజు లాస్ట్ షాట్ ఇదే అంటూ క్రాక్ షూటింగ్ జరుగుతున్న స్పాట్‌ను చూపించాడు. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. గోపీచంద్ మలినేని ఈ సారి రవితేజకు మంచి హిట్ ఇచ్చేందుకు ప్రిపేర్ అయ్యాడనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











