Don't Miss!
- News Lok Sabha Election 2024 Polling LIVE Updates: అతిపెద్ద పండగకు తొలి ఘట్టం..
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాధిక రెండోసారి అమ్మమ్మ.. కూతురు పెట్టిన పేరుతో ఎమోషనల్!
ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ రెండోసారి అమ్మమ్మ అయ్యారు. తన కూతురు రయానే ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. రయానే మిథున్ ఇటీవల మరోసారి ఆడపిల్లకు జన్మినివ్వడం తెలిసిందే. దాంతో రాధిక కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిసాయి. అయితే తన కూతురుకు రెయానే పెట్టిన పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇంతకు రెయానా ఏం పేరు పెట్టారంటే..
రాధిక కూతురు వివాహం క్రికెటర్‌తో
యాక్టర్ రాధిక శరత్ కుమార్ కూతురు రేయానే భారతీయ క్రికెటర్ అభిమన్యు మిథున్‌తో 2016లో వివాహం జరిగింది. 2018లో తొలిసారి రెయానే మగబిడ్డకు జన్మినిచ్చారు. దాంతో తొలిసారి నటి రాధిక అమ్మమ్మగా మారారు. ఆ మగబిడ్డకు తారక్ అని నామకరణం చేశారు.
రాధిక రెండోసారి అమ్మమ్మగా
ఇక రాధిక శరత్ కుమార్ ఇంట్లో మార్చి 15న ఆనందోత్సవాలు చోటుచేసుకొన్నాయి. రెయానే రెండోసారి మాతృత్వ మధురాన్ని ఆస్వాదించింది. దాంతో రాధిక రెండోసారి అమ్మమ్మగా మారారు. అయితే తమ ఇంటిలోకి అడుగు పెట్టిన మహాలక్ష్మికి పెట్టిన పేరు ఎమోషనల్‌గా మార్చింది.
నా బిడ్డకు పేరు ఇలా పెట్టా
తన తల్లి రాధిక శరత్‌కుమార్‌కు గుర్తుగా తన బిడ్డకు రాధ్యా మిథున్ అని నామకరణం చేసినట్టు రెయానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. రెయానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును పెడుతూ.. నా రెండో బిడ్డ రాధ్య మిథున్‌ను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. జీవితంలో నా బిడ్డకు అంతా మంచే జరుగాలని కోరుకొంటున్నాను. మీరు కూడా దీవించండి అంటూ రెయానే కోరారు.
నా కూతురు కూడా తల్లిలానే
నా తల్లిలానే నా కూతురు తన జీవితంలో మానసికంగా ధైర్యంగా ఉండాలనేది నా కోరిక. అందుకే నాకు జన్మనిచ్చిన తల్లి రాధిక పేరు ఉండేలా రాధ్యా అనే పేరు చేర్చాను. నాకు గొప్ప జన్మనిచ్చిన తల్లికి ఇంతకంటే ఏం ఇవ్వగలను. నా స్పందనకు నా తల్లి సంతోషంగా ఉంటుందని భావిస్తున్నాను అని రెయానే పేర్కొన్నారు.
Recommended Video
రెయాన్ నిర్ణయంపై ప్రశంసలు
తన తల్లికి రెయానే మిథున్ ఇచ్చిన గౌరవాన్ని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఓ తల్లిగా తన తల్లిని గుర్తుంచుకోవడంపై అభినందిస్తున్నారు. చిన్నారికి పెట్టిన పేరు చాలా బాగుందని నెటిజన్లు దీవెనలు అందిస్తున్నారు. ఏది ఏమైనా కూతురు తీసుకొన్న నిర్ణయం తల్లి రాధికను మరింత సంతోషానికి గురిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.