CCL 2024 నరాలు తెగెంత ఉత్కంఠ.. విజయానికి 2 బాల్స్ 2 రన్స్.. తెలుగు వారియర్స్ ఓటమికి కారణాలు ఇవే!

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో విజయాలతో దూసుకెళ్తున్న తెలుగు వారియర్స్ జట్టు అనూహ్యంగా ఓటమిపాలైంది. అత్యంత సులభంగా గెలుపు ముగింట ఉండగా.. చేజేతులా ఓడిపోవడం తెలుగు సినీ, క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశలో ముంచెత్తింది. చివరి ఓవర్‌లో కేరళ బౌలర్ అలెగ్జాండర్ విసిరిన బంతులకు తెలుగు వారియర్స్ బ్యాట్స్‌మెన్ బిక్కముఖం పెట్టారు. దాంతో 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన తెలుగు జట్టు దారుణంగా ఓటమిపాలైంది. ఈ ఓటమికి కారణాలు ఏమిటంటే?

కేరళ స్ట్రైకర్స్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఓపెనర్లతోపాటు 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో బౌలింగ్ చేసిన సచిన్ పేలవమైన బౌలింగ్‌తో భారీగా పరుగులు ఇచ్చారు. దాంతో కేరళ బ్యాట్స్‌మెన్లు క్రీజులో నిలదొక్కుకోవడమే కాకుండా మరింత విశ్వాసంతో దూకుడుగా ఆడారు. దాంతో 77 పరుగుల విజయలక్ష్యాన్ని తెలుగు వారియర్స్ ముందు ఉంచడంలో సక్సెస్ అయింది.

Reason Behind Defeat of Telgu Warriors against Kerala Strikers in Celebrity Cricket League 2024

తెలుగు వారియర్స్ రెండో ఇన్నింగ్స్‌లో నిర్ణీత 10 ఓవర్లకు 77 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే తమన్, అశ్విన్, సుధీర్ బాబు వెంట వెంటనే అవుట్ అవ్వడంతో తెలుగు వారియర్స్ జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్ బ్యాటింగ్‌లోను పేలవంగా ఆడారు. పరుగులు సాధించలేకపోవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. అలాంటి సమయంలో అఖిల్ వేగంగా పరుగులు సాధించే క్రమంలో అవుటయ్యాడు.

అయితే చివరి రెండు ఓవర్లలో అంటే 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే 9వ ఓవర్‌లో 8 పరుగులు సాధించారు. దాంతో చివరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే తొలి రెండు బంతుల్లో కేరళ బౌలర్ అలెగ్జాండర్ వరుసగా రెండు వికెట్లు తీసి షాకిచ్చాడు.

ఆ సమయంలో మూడో బంతికి సింగిల్ రావడంతో 5 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నాలుగో బంతికి వైడ్స్ రూపంలో 2 పరుగులు రావడంతో 8 పరుగులు లక్ష్యం ముందుకు వచ్చింది. అయితే నాలుగో బంతికి ఆదర్శ్ సిక్సర్ కొట్టడంతో 2 బంతుల్లో 2 పరుగులు జట్టు చేయాల్సి రావడంతో అంతా విజయం తెలుగు వారియర్స్ అనుకొన్నారు.

కానీ ఆదర్శ్ చివరి రెండు బంతుల్లో విజయానికి కావాల్సిన రెండు పరుగులను, టై మ్యాచ్ కావాల్సిన ఒక పరుగు కూడా చేయలేకపోవడం తెలుగు వారియర్స్ అనూహ్యంగా ఓటమి పాలైంది. చేతులోకి వచ్చిన విజయాన్ని చేజార్చుకొని తెలుగు వారియర్స్ జట్టు కష్టాల్లో పడింది. ఈ లీగ్‌లో క్వార్టర్ ఫైనల్‌కు వెళ్లాలంటే కంపల్సరీగా గెలువాల్సిన పరిస్థితి తెచ్చుకొన్నది. రెండో ఇన్సింగ్స్‌లో జట్టు ఆటగాళ్లందరూ ఒత్తిడికి గురైనట్టు కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X