ఆద్య విషయంలో అలా జరిగితే అది నా బాధ్యత కాదు.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
పవన్ కళ్యాణ్ భార్యగా కంటే మాజీ భార్యగా రేణూ దేశాయ్ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్‌తో విడాకులు, పుణెలో సెటిల్ అవ్వడం, రెండో పెళ్లికి రెడీ అవ్వడం, ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇక రెండో పెళ్లి విషయంలోనైతే రెండు వర్గాలుగా చీలి మరి వాగ్వాదానికి దిగారు. ఈ మధ్య కాస్త వాటన్నంటికి దూరంగా ఉంటోంది రేణూ దేశాయ్. ఆ మధ్య హైద్రాబాద్‌లో ఇంటిని కొనుగోలు చేసిన విషయంలోనూ వివాదం చెలరేగింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ తన పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటోంది.

నిత్యం ఏదో ఒక పోస్ట్..
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్‌తో వేరుపడ్డాక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. తన గురించి, తన పిల్లల, తనలో నిగూఢంగా దాగి ఉన్న రచయిత్రిని, కవిని మేల్కొలుపుతుంది. ప్రకృతిని ఆస్వాధించడమంటే రేణూ దేశాయ్‌కి ఎంతో ఇష్టం.

పిల్లలే ప్రపంచంగా..
రేణూ దేశాయ్ తన పిల్లలు (అకీరా నందన్, ఆద్య) ప్రపంచంగా బతుకుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో షేర్ ఫోటోలైనా, పోస్ట్‌లైనా వారి గురించే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆద్య సోషల్ మీడియాలో ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటుంది. అకీరా మాత్రం ఎప్పుడూ అంతగా ఫోకస్ కాడు. ఆద్య తీసే ఫోటోలనే రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

బుల్లితెరపై..
రేణూ దేశాయ్ ప్రస్తుతం బుల్లితెరపై బిజీ అవుతోంది. ఆ మధ్య డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వచ్చి మెప్పించింది. రైతుల మీద ఓ సినిమాను తీసేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ లాక్ డౌన్ సమయంలోనే ఓ కామెడీ సీరియల్ షూటింగ్‌లోనే పాల్గొంది. యూట్యూబ్ వీటికి సంబంధించిన వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి.

పిజ్జా అంటే ఇష్టమట...
రేణూ దేశాయ్‌కి కొన్ని చిరు తిండ్లంటే ఇష్టమట, వాటి పేరు వింటే వెంటనే ఫేస్, లుక్కు మారిపోతుందని చెప్పుకొచ్చింది. ‘ఎవరైనా పానీ పూరి, పిజ్జాల గురించి చెబుతూ ఉండగా నేను వింటే నా ఎక్స్‌ప్రెషన్ మారిపోతుంద'ని రేణూ దేశాయ్ తన సీక్రెట్ తెలిపింది.
Recommended Video

ఆద్య చేసిన కేక్..
తాజాగా మరో ఫోటోను షేర్ చేసిన రేణూ దేశాయ్ ఈసారి ఆద్యలోని కొత్త నైపుణ్యాన్ని పరిచయం చేసింది. ఆద్య ఓ కేక్ తయారుచేసిందట. ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ.. ‘ఎంతో రుచికరమైన వెగన్ కేక్‌ను ఈ టౌన్‌లో ఆద్య తయారు చేస్తే.. దాని గురించి ఏదైనా దొంగతనం జరిగితే మాత్రం నా బాధ్యత కాద'ని సెటైర్ వేసింది.


Click it and Unblock the Notifications











