twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలవాట్లు మార్చుకోకపోతే మరో విపత్కరం.. హెచ్చరిస్తున్న రేణూ దేశాయ్

    |

    ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్‌తో పోరాడేందుకు కిందా మీదా పడుతోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా గుప్పిట్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. చైనాలోని వింత ఆహారపు అలవాట్ల కారణంగా పుట్టిన కరోనా ఇప్పటికీ ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి కరోనా సోకింది. మన దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చింది. అయితే తాజాగా మరో కొత్త వైరస్ చైనాలో ప్రబలుతోందని వార్తలు కలకం రేపుతోంది. వీటిపై రేణూ దేశాయ్ స్పందించింది.

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    సోషల్ మీడియాలో యాక్టివ్..


    రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, ఒకప్పటి హీరోయిన్‌గా బాగానే ఫేమస్. అయితే అంతకుమించి పేరు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. ఆమె షేర్ చేసే ఫోటోలు, రాసే కవిత్వాలు, సమస్యలపై స్పందించే తీరుతో ఎంతో మందికి దగ్గరైంది. సామాజిక సమస్యలపై స్పందించే రేణూ దేశాయ్ తాజాగా ఓ పోస్ట్ చేసింది.

    మరో వైరస్..

    మరో వైరస్..

    చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికిస్తుండగానే.. మళ్లీ అక్కడి ఉత్తర ప్రాంతం నుంచి మరో ప్రాణాంతక వైరస్ బయట పడింది. ఎలుకలను తిన్న ఓ ఇద్దరికి బ్యుబోనిక్ ప్లేగ్ అనే వ్యాధి విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యాధి తీవ్రత దృష్ట్యా లెవెల్ 3 వార్నింగ్ ను జారీ చేశారట చైనా అధికారులు.

    రేణూ దేశాయ్ సూచన

    రేణూ దేశాయ్ సూచన


    అయితే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, మన దేశంలో కూడా ఇలాంటి వింత ఆహారాన్ని, మాంసాన్ని తింటున్నారని రేణూదేశాయ్ చెప్పుకొచ్చింది. మణిపూర్‌లో ఓ మార్కెట్‌లో వింత వింత జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారని తెలిపే ఓ వీడియోను షేర్ చేసింది.

    అలవాట్లు మార్చుకోకపోతే..

    అలవాట్లు మార్చుకోకపోతే..

    ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే మరో విపత్కర పరిస్థితి మన చుట్టూనే రెడీగా ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అందరికీ ఓ విన్నపం చేసుకుంది. దయచేసి అందరూ కనీసం మార్పు కోసం స్వార్థంగా ఆలోచించండని, మన భద్రత కోసం మాంసాన్ని తినడం ఆపేయండని కోరింది.

    English summary
    Renu Desai About bubonic plague. The bubonic plague is caused by the bacteria Yersinia pestis. It can spread through contact with infected fleas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X