అలా ఒళ్లో వాలి నిద్రపోయి.. రేణూ దేశాయ్ ఇంట్లో పవన్ కళ్యాణ్!.. అభిమానులకు కిక్కిచ్చే ఫోటో

రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. అది విడాకులైనా సరే పిల్లలకు, మాజీ భార్యకు కొత్తింటిని కొనిచ్చాడన్న పుకార్లైనా సరే ఇలా ఏదో ఒకటి నిత్యం వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ భార్యభర్తలుగా విడిపోయినా.. పిల్లలకు మాత్రం తల్లిదండ్రులుగా ఇంకా కలిసే ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా రేణూ దేశాయ్ షేర్ చేసిన ఫోటోను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

పిల్లల కోసం..

పిల్లల కోసం..

భార్య భర్తలుగా రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ మధ్య తగ్గించలేని దూరం పెరిగిపోయింది. ఆ మధ్య విడాకుల వ్యవహారం సోషల్ మీడియాకు ఎక్కడంతో రకరకాల కామెంట్లు వచ్చాయి. భార్య ఉండగా.. వేరే వ్యక్తితో పిల్లలను కంటే సంసారం చేస్తే ఎలా ఉంటుందో ఆ బాధ మీకు తెలుసా? అంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది. అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చింది.

రెండో పెళ్లికి సిద్దం..

రెండో పెళ్లికి సిద్దం..

ఇంట్లో వారి ఒత్తిడి, తనకంటూ ఓ తోడు ఉండాలనే ఉద్దేశ్యంతో రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సిద్దమైనట్టు చెప్పుకొచ్చింది. కానీ అది అప్పట్లో పెను సంచలనమైంది. రెండో పెళ్లి చేసుకోకు వదిన అంటూ కొందరు అభిమానులు రిక్వెస్ట్.. ఇంకొందరు వార్నింగ్ లాంటివి కూడా ఇచ్చారు. ఇదే ప్రశ్నకు మీ అన్న పవన్ కళ్యాణ్‌ను ఎందుకు అడగరంటూ రేణూ దేశాయ్ ఫైర్ అవ్వడంతో అప్పట్లో వార్తల్లో ప్రధానంగా నిలిచింది. అయితే రేణూ దేశాయ్ తన రెండో పెళ్లిపై మళ్లీ ఇంత వరకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు.

ఆ మధ్య హర్ట్..

ఆ మధ్య హర్ట్..

పవన్ కళ్యాణ్ తన పిల్లలకు, మాజీ భార్య కోసం హైద్రాబాద్‌లో ఓ లగ్జరీ ఇళ్లు కొనిచ్చాడనే రూమర్లు బాగా వైరల్ అయ్యాయి. వాటిపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. అందులో ఎంత మాత్రం నిజం లేదని చెప్పింది. ఆయన నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, అది తన కష్టార్జితంతో కొనుక్కున్నానని తెలిపింది. ఇలాంటి వార్తలు రాసి బాధపెట్టకండి మీడియాను రేణూ దేశాయ్ వేడుకుంది.

కరోనాలో అలా..

కరోనాలో అలా..

కరోనా సమయంలో అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఆ మధ్య బుల్లితెర షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో జీ తెలుగు చానెల్‌లో ప్రసారమైన కొన్ని షోల్లో రేణూ దేశాయ్ సందడి చేసింది. పాటల ప్రోగ్రాం, కామెడీ షోల్లో యాంకర్ రవి, జానీ మాస్టర్‌తో సందడి చేసింది.

ఆ సమయంలో..

ఆ సమయంలో..

అయితే అలా కరోనా సమయంలో షూటింగ్‌లకు బయటకు వెళ్లి రావడంతో ఇంట్లో ఉన్న పిల్లల గురించి ఆలోచిస్తే భయం వేసిందట. కరోనా ఉన్న సమయంలో అలా బయటకు వెళ్లి రావడంతో ఇంట్లోకి వచ్చాక దూరంగానే ఉండేదట. అలా షూటింగ్ కోసం వారం రోజులు బయటకు వెళ్లడంతో.. పిల్లలను పవన్ కళ్యాణ్ దగ్గరకు పంపించానని చెప్పుకొచ్చింది.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
అప్పుడు దించిన ఫోటోనేనా?

అప్పుడు దించిన ఫోటోనేనా?

తాజాగా రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ ఒళ్లో తన పిల్లలిద్దరూ తల వాల్చి పడుకున్నారు. ఈ అపురూపమైన ఫోటోను తానే తీశానని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే ఇది రేణూ దేశాయ్ ఇంట్లోనా? లేదా.. పవన్ కళ్యాణ్ ఇంట్లోనా? అన్నది తెలియడం లేదు. కానీ ఈ ఫోటో గురించి రేణూ దేశాయ్ చెప్పిన మాటలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని అద్భుతమైన ఫోటోలు కచ్చితంగా షేర్ చేయాలి.. అలాంటి ఫోటోలు మన ఫోన్‌లో ఊరికే ఉంచకూడదు.. నా ఫోన్‌లోని కెమెరాతో నేను బంధించిన కొన్ని అపురూపమైన చిత్రాల్లో ఇదొకటి అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X